బెంగళూరులో ఇల్లు కొనడమా..అద్దెకు ఉండటమా..ఏది బెటర్ ? వైరల్ అవుతున్న హాట్ డిబేట్ ఇదిగో..

భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో ఇల్లు కొనడం నిజంగా ఆర్థికంగా, జీవనశైలికి అర్ధవంతమా అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ రసవత్తరంగా కొనసాగుతోంది.


ఇటీవల Redditలో పోస్ట్ చేయబడిన ఒక వ్యాఖ్య వైరల్ కావడంతో.. బెంగళూరులో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలపై, అద్దెకు ఉండడం బెటరా? లేక ఇల్లు కొనడం బెటరా? అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. వేలాది మంది ఈ చర్చలో పాల్గొంటూ తమ అనుభవాలు, ఆలోచనలు, వాస్తవాలను పంచుకుంటున్నారు.

32 సంవత్సరాల వయసున్న ఒక Reddit యూజర్ ఈ వాదనకు కేంద్ర బిందువుగా మారాడు. తనకు దాదాపు రూ. 7 కోట్ల నికర సంపద ఉండి, నెలకు రూ. 3.7 లక్షల ఆదాయం ఉన్నా కూడా, బెంగళూరులో ఇల్లు కొనడం ఏ మాత్రం ఆర్థిక తర్కం కాదని ఆయన వాదించాడు. ప్రస్తుతం Jayanagarలో 3BHK ఇంటిని కేవలం రూ. 35,000 అద్దెకు తీసుకుని జీవిస్తున్నానని,..కానీ అదే ప్రాపర్టీ కొనాలంటే దాదాపు రూ. 8 కోట్లు ధర పడుతుందని ఆయన పేర్కొన్నాడు. ఒక స్థిర ఆస్తిలో నా మొత్తం సంపదను బంధించడంలో అర్ధమేంటి?” అంటూ ప్రశ్నించాడు. అద్దె దిగుబడి (rental yield) భారతదేశంలో “ఒక జోక్” మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.

బెంగళూరులోని Whitefield, Sarjapur, Varthur వంటి విస్తరిస్తున్న ప్రాంతాలకు వెళ్లాలనే ఆలోచనను కూడా ఆయన తిరస్కరించాడు. అవి పూర్తిగా రద్దీగా, పేలవమైన ప్రణాళికతో, నిత్యం ట్రాఫిక్ గందరగోళంలో మునిగిపోయే ప్రదేశాలుగా ఆయన పేర్కొన్నారు. అది నా జీవనశైలి కాదు. ఆరోగ్యం, సమయం, ప్రశాంతత కూడా విలువైనవేనని అన్నారు.ఇల్లు కొనకుండా అద్దెకు ఉండడాన్ని ఆయన యూరప్‌తో పోల్చుతూ మరొక ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తాడు. దాదాపు అదే డబ్బుతో, యూరప్‌లోని కొన్ని దేశాల్లో శాశ్వత నివాసం దిశగా వెళ్లి, మెరుగైన మౌలిక వసతులు, ప్రణాళికతో జీవించగలనని ఆయన రాశాడు.

ఈ అభిప్రాయానికి వేలాది స్పందనలు వెల్లువెత్తాయి. కొందరు పూర్తిగా అంగీకరించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక యూజర్ యూరప్‌లో జీవించడం అంత తేలిక కాదని పేర్కొంటూ, సులభంగా చెప్పొచ్చు, కానీ ప్రయత్నిస్తే నిజం తెలుస్తుంది. విదేశాల్లో గోధుమ చర్మం కలిగినవారికి జీవితం అంత సులభం కాదు. చివరికి భారతదేశమే మనకు బలం అంటూ సందేశాన్ని రాశాడు.

మరో యూజర్ ప్రస్తుతం UKలో నివసిస్తున్నానని కానీ Bengaluru ధరలు UKలోని కొన్ని ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని ఆశ్చర్యపూర్వకంగా తెలిపాడు. ఇక్కడ జీవన నాణ్యత పెరగకపోయినా, ధరలు మాత్రం రెట్టింపు అయ్యాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ నికర విలువ ఉన్న నేను ఇక్కడ ఇల్లు కొనడం ఆత్మహత్యలా అనిపిస్తోందని తెలిపాడు.

మరొక నెటిజన్.. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పటికే అస్థిర స్థితిలో ఉందని హెచ్చరించారు. 2014 నుంచే ఇల్లు కొనడం అర్ధంలేని పెట్టుబడిగా మారింది. పన్ను మార్పులతో ఇండెక్సేషన్ తొలగించడంతో 124 శాతం వరకు అదనపు భారమొస్తోంది. రూ. 8 కోట్ల ప్రాపర్టీ రేపు రూ. 4 కోట్లకూ తగ్గిపోవచ్చు అని అన్నారు. NRIలు లగ్జరీ సెగ్మెంట్‌ను నడిపిస్తున్నారని, IT హబ్‌గా Hyderabad ఇప్పటికే Bengaluruను వెనక్కి నెట్టిందని వాదించారు.ఈ చర్చ ప్రధానంగా ఇల్లు కొనడం ఆర్థిక స్థిరత్వానికి చిహ్నమా? లేక అద్దె జీవితం మరింత స్వేచ్ఛ, మంచి జీవన నాణ్యతను ఇస్తుందా? అనే దానిపై ఆసక్తి రేపుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.