Business Idea: ఇంట్లోనే కర్పూరం తయారీ వ్యాపారం.. రూ. వేలల్లో ఆదాయం..

www.mannamweb.com


మారుతోన్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం రకరకాల వ్యాపారాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే చాలా మంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయన్న అభిప్రాయంతో ఉంటారు.

కానీ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తే మంచి ఆదాయం పొందొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

కర్పూరం వినియోగం ఎంత అనివార్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవాలయాలు మొదుల ఇళ్ల వరకు ప్రతీ రోజూ కర్పూరం ఉండాల్సిందే. హిందువులు ప్రతీ రోజూ కర్పూరంను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలాంటి నిత్యవసర వస్తువు తయారీని మీ వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ కర్పూరం తయారీకి అవసరమయ్యే మిషిన్స్‌ ఏంటి.? ఎంత పెట్టుబడి కావాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కర్పూరం తయారీకి కావాల్సిందల్లా తయారీ మిషన్‌తో పాటు ముడి సరుకు. ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఈ మిషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్‌ ధర విషయానికొస్తే ఫుల్లీ ఆటోమెటెడ్‌ మిషన్‌ ధర రూ. 1 లక్ష నుంచి ప్రారంభంలో ఉంటాయి. వీటితో పాటు ముడి సరుకును కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ కోసం కవర్‌ కూడా అవసరపడుతుంది. ఇలా తయారు చేసిన కర్పూరాన్ని మీ సొంత బ్రాండ్‌తో మార్కెటింగ్ చేసుకొని విక్రయిస్తే మంచి ఆదాయం పొందొచ్చు.

కర్పూరం తయారీ మిషన్స్‌కు సంబంధించి యూట్యూబ్‌లో చాలా వీడియోలు ఉన్నాయి. వీటిలో పేర్కొన్న నెంబర్లను సంప్రదించడం ద్వారా మిషిన్స్‌తో పాటు ముడి సరుకులను పొందొచ్చు. అయితే ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకుండా. నేరుగా వెళ్లి మిషిన్‌ను చూసి, తయారీ విధానాన్ని తెలుసుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాల్సి. అడ్వాన్స్‌గా ఎలాంటి డబ్బు చెల్లించడకపోవడమే ఉత్తమం.