హిందూ సంస్కృతిలో కర్పూరానికి చాలా ప్రాధాన్యం ఉంది. దేవుడి పూజ, వ్రతాల సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తుంటారు. దీనివల్ల ఇల్లు శుద్ధి కావడమే కాకుండా.. నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందని అంతా నమ్ముతారు. కర్పూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాదు కర్పూరం చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి కర్పూరం మొక్కలను ఇంట్లో ఈజీగా ఎలా పెంచాలో ఇక్కడ తెలుసుకుందాం.
కర్పూరం.. హిందూ ధర్మంలో పూజకు వాడే ఒక ముఖ్యమైన వస్తువు. చాలామంది కర్పూరం వెలిగించకుండా పూజను ప్రారంభించరు. కర్పూరం వెలిగిస్తే.. మంచి వాసనే కాదు.. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారిపోతుందని నమ్మకం. కర్పూరం వల్ల చాలా లాభాలున్నాయి. దీనిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కర్పూరం చెట్టు నుంచి వస్తుందని చాలామందికి తెలియదు.
మనలో చాలామంది కర్పూరం చెట్టును చూసుండరు. ఇది ఎత్తుగా పెరుగుతుందట. ఇంటి ముందు అందంగా ఉండడానికి కూడా కొంతమంది ఈ చెట్టును పెంచుకుంటారట. మీరు కూడా పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే కర్పూరం మొక్కను ఈజీగా ఎలా పెంచాలో ఇక్కడ తెలుసుకుందాం.
కర్పూరం చెట్టు తక్కువ శ్రద్ధతో పెరిగే మొక్క. ఇది పర్యావరణానికి మంచిది. గాలిని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ మొక్కను కుండీలో పెంచుకోవడం కూడా సులువే.
కర్పూరం చెట్టు ఇళ్లు లేదా పెరటి అందాన్ని పెంచుతుంది. కర్పూరం గింజలు వెచ్చని నేలలో త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి ఈ చెట్టును వేయడానికి వసంతకాలం బెస్ట్ టైమ్.
కర్పూరం మొక్క నాటడానికి ముందుగా గింజలు కొనాలి. ఇంటి దగ్గర పెద్ద పెరడు ఉంటే నేలలో.. లేదంటే కుండీలో కూడా వేసుకోవచ్చు. గింజలు ఉపయోగించి కర్పూరం చెట్టు నాటడానికి ముందుగా గింజలను మట్టిలో 10 సెంటీమీటర్ల లోతులో పాతి కాస్త నీళ్లు పోయాలి.
మొక్కలు సరైన సైజుకు చేరుకున్నాక.. వాటిని పెద్ద కుండీల్లోకి మార్చాలి. కర్పూరం చెట్టుకు సూర్యరశ్మి అవసరం. తక్కువ సూర్యరశ్మిలో కూడా ఇది బతుకుతుంది. దీనికి 25 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.
కర్పూరం మొక్క ఇంట్లో ఉంటే సానుకూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇది ఇంటి వాతావరణాన్ని సువాసనతో మార్చడంతోపాటు దుష్ట ప్రభావం పడకుండా చేస్తుందని నమ్మకం.