ప్రపంచ వాణిజ్యంలో చైనాది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. యావత్ ప్రపంచానికే సరుకులను ఉత్పత్తి చేసే పవర్ హౌస్ గా చైనాకు తిరుగులేని ఖ్యాతి ఉంది అని చెప్పవచ్చు.
అందుకే అమెరికా సైతం ఎన్ని టారిఫ్ లు విధించిన చైనా వెనక్కు తగ్గకుండా అగ్రరాజ్యం బెదిరింపుని సైతం బేఖాతరు చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎగుమతుల వ్యాపారంలో చైనా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది. 2023 గణాంకాల ప్రకారం చూసినట్లయితే చైనా మొత్తం 3.4 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే వస్తువుల్లో చైనా వాటా 14 శాతం ఉందంటే దాని సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు.
చైనా నుంచి అత్యధికంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. వీటిలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, కంప్యూటర్ పరికరాలు, లాప్ టాప్ లు, భారీ మెషిన్లు, వస్త్రాలు, బొమ్మలు, బల్క్ డ్రగ్స్, స్పెషాలిటీ కెమికల్స్, రేర్ ఎర్త్ మెటల్స్, సోలార్ పలకలు ఇలాచైనా ఎగుమతి చేసే వస్తువుల లిస్టు చాలా పెద్దదే అని చెప్పవచ్చు. వీటిలో అత్యధికం అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. చైనా అమెరికా మధ్య 2023 నాటికి 570 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత యూరప్ చైనా నుంచి దాదాపు 560 బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంది.
చైనాకు ఈ ఎగుమతులు – దిగుమతుల వాణిజ్యం వల్ల దాదాపు 823 బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్ ప్లస్ అంటే దిగుమతులకన్నా ఎగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు రెండిటి మధ్య వచ్చిన తేడానే వాణిజ్యమిగులు అంటారు ఇది చాలా అత్యధికంగా ఉంది అని చెప్పవచ్చు. 2020లో కోవిడ్ అనంతరం కూడా చైనా ఇదే స్థాయిలో ఎగుమతులను చేస్తుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే స్మార్ట్ ఫోన్లలో 70% చైనాలోని ఉత్పత్తి అవుతుంటాయి.
అయితే చైనా వస్తువులు నాణ్యత లేవని పేరు ఉన్నప్పటికీ, భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే ఎలక్ట్రానిక్స్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ చైనా నుంచి దిగుమతి అయిన వస్తువులే డిమాండ్ తీరుస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల్లో మొబైల్ యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్, హోమ్ డెకరేషన్ ఐటమ్స్, కిచెన్ టూల్స్, ఎల్ఈడి బల్బులు, సోలార్ ప్యానల్స్, స్టేషనరీ వస్తువులకు చాలా డిమాండ్ ఉంది. దేశీయంగా ఉత్పత్తులు ఈ డిమాండ్ ను ఈరోజుకు కూడా తీర్చలేక పోతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని మీరు చైనా నుంచి డిమాండ్ ఉన్నటువంటి వస్తువులను దిగుమతి చేసుకొని వాటిని విక్రయించే వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే ఏం చేయాలో తెలుసుకుందాం.
చాలామందికి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని వ్యాపారం చేయడం అనేది పూర్తిగా ప్రభుత్వ వ్యవహారం, లేదా స్మగ్లింగ్ ద్వారా వస్తాయి అని అపోహ పడుతుంటారు. కానీ హోల్ సేల్ వ్యాపారస్తులు నేరుగా చైనాలో సరుకు కొనుగోలు చేసి చట్టబద్ధంగా దిగుమతి చేసుకొని మన దేశంలో విక్రయించుకునే అవకాశం ఉందన్న సంగతి తెలియదు.
చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయించాలంటే ఎలాంటి పర్మిషన్లు రిజిస్ట్రేషన్లు అవసరమో తెలుసుకుందాం.
>> ముందుగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
>> దీనికోసం మీరు ప్రయారిటీషిప్ లేదా పార్ట్నర్ షిప్, లేదా ఎల్.ఎల్ పీ, లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
>> అలాగే ఎం ఎస్ ఎం ఈ, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు చాలా మంచిది.
>> GST రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
>> దీంతోపాటు ఇంపోర్టు ఎక్స్ పోర్టు కోడ్ (IEC) కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
>> IEC కోడ్ DGFT నుంచి పొందాల్సి ఉంటుంది.
>> ఇప్పుడు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు మీరు ఏ కేటగిరీ సర్కులను దిగుమతి చేసుకుంటున్నారు దానికి సంబంధించిన హార్మోనైజ్డ్ సిస్టం కోడ్ పొందాల్సి ఉంటుంది.
>> ఆ తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఎండ్ యూజ్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. దీనితోపాటు FSSAI, ISI, CE వంటి ఏజెన్సీలో లైసెన్సులు కూడా పొందాల్సి ఉంటుంది.
>> అలాగే కష్టం క్లియరెన్స్ కోసం కష్టం క్లియరింగ్ ఏజెంట్ సహాయం తీసుకుంటే మంచిది
చైనాలో ఈ మార్కెట్లలో అతి తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయి…
>> షెంజెన్ నగరం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు పెట్టింది పేరు. ఇక్కడ బ్లూటూత్ స్పీకర్లు, పవర్ బ్యాంక్స్, ట్రిమ్మర్లు, మిక్సీలు, ఇతర గృహోపకరణాలు, సిరీస్ ల్యాంప్స్ వంటి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు లభిస్తాయి. వీటికి మన దేశంలో చాలా డిమాండ్ ఉంది.
>> గ్వాంగ్ జౌ నగరంలో కూడా అన్ని రకాల గ్యాడ్జెట్స్ లభిస్తాయి.
>> ఫోషాన్ మార్కెట్లో హోం డెకరేషన్ వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి.
>> హాంగ్ జో మార్కెట్లో డిజైనర్ వస్త్రాలు, ఉన్ని దుస్తులు వంటివి తక్కువ ధరకు లభిస్తాయి.
భారత్ లో ఎలా విక్రయించాలి
>> చైనా నుంచి తెచ్చిన సరుకులను ఈ కామర్స్ యాప్స్ ద్వారా కూడా విక్రయించవచ్చు.
>> బి టు బి ( బిజినెస్ టు బిజినెస్) ప్రాతిపదికన రిటైల్ మార్కెట్లో వస్తువులను విక్రయించే వ్యాపారులకు హోల్ సేల్ ధరలకు విక్రయించినట్లయితే, పెద్ద మొత్తంలో మీ వస్తువులు క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత, మీరు మరోసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు.
>> అయితే చైనా నుంచి సరుకులు తెప్పించుకునేటప్పుడు మొదట ఏ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉందో గుర్తించి స్థానికంగా వేటి ఉత్పత్తులు తక్కువగా ఉన్నాయో గుర్తించి దిగుమతి చేసుకొని విక్రయిస్తే మంచిది.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































