పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను ఉద‌యం తిన‌వ‌చ్చా

www.mannamweb.com


Sunflower Seeds : ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆరోగ్య‌క‌ర ఆహారాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల ఫుడ్స్‌ను చాలా మంది తింటున్నారు. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల జాబితా విష‌యానికి వ‌స్తే వాటిల్లో న‌ట్స్‌, సీడ్స్ కూడా ఉంటాయి. సీడ్స్‌లో మ‌న‌కు పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ముఖ్య‌మైన‌వే. చాలా మంది గుమ్మ‌డికాయ విత్త‌నాలు, స‌బ్జా విత్త‌నాల‌ను తింటారు. అయితే పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. ఈ విత్త‌నాలను రోజూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను ఉద‌యం పూట తింటేనే మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. ముందు రోజు రాత్రి వాటిని ఒక గుప్పెడు మోతాదులో తీసుకుని నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం వాటిని బ్రేక్‌ఫాస్ట్ క‌న్నా ముందు తినాలి. ఇలా పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. ఈ విత్త‌నాల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ విత్త‌నాల్లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందువ‌ల్ల పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తింటే మీ గుండె సేఫ్ అని చెప్ప‌వ‌చ్చు.

ఇక ఈ విత్త‌నాల‌ను తింటే శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే ఈ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. ఇవి కణాలు నాశ‌నం కాకుండా చూస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో బి విట‌మిన్లు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్ బి1 (థ‌యామిన్‌) అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ సీడ్స్‌ను తింటే మ‌న శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ఈ విత్త‌నాల్లో ఉండే విట‌మిన్ బి6 మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది. దీంతో మెద‌డు చురుగ్గా, యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది.

పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ల‌భిస్తుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో రోజూ సుఖ విరేచ‌నం అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా ఈ సీడ్స్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వీటిని ఉద‌యాన్నే తినాల‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు.