YS Sharmila Emotional : అంత మాట అంటావా అన్నా – కంటతడి పెట్టుకున్న షర్మిల !

www.mannamweb.com


Elections 2024 : వైఎస్ కుటుంబంలో రాజకీయాలు వీధికెక్కుతున్నాయి. షర్మిలపై జగన్ చేస్తున్న ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ చానల్ ఇంటర్యూలో కుటుంబంలో విబేధాలకు షర్మిల రాజకీయ కాంక్షే కారణం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.

దీనిపై షర్మిల మీడియా ఎదుట స్పందించారు. ఎమోషనల్ అయ్యారు. తన రాజకీయ కాంక్షే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలకు కారణమని జగన్ చెప్పారని.. ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని షర్మిల ప్రశ్నించారు.

నన్ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డే – వైసీపీ కోసం పని చేయలేదా ?

జగన్మోహన్ రెడ్డి అరెస్టు టైంలో , 19 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉపఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగిందని ఎవరని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్ర చేయమని అడిగింది మీరు కాదా అని ప్రశఅనించారు. ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి సమైఖ్యాంధ్ర, బైబై బాబు క్యాంపెయిన్, తెలంగాణలో పాదయాత్ర చేపించింది మీరు కాదా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నిజంగా రాజకీయ కాంక్ష ఉంటే పాదయాత్ర చేసినప్పుడు జైల్లో ఉన్నారు. అప్పుడు వైసీపీని హస్తగతం చేసుకునే ఉంటే అడిగేది ఎవరని మండిపడ్డారు.

పదవే కావాలనుకుంటే.. మొండిగా పొందగలను !

పొందాలనుకున్న పదవి మొండిగానైనా పొందగలనని షర్మిల స్పష్టం చేశారు. వివేకా లాంటి ఎంతో మంది తనను ఎంపీగా చేయాలని అనుకున్నారు. మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. మీతో ఉన్నంత కాలం సీఎంగా అయ్యే వరకు నాకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. నేను నా అన్న కోసం చేశాను. వైఎస్ సంక్షేమ పాలన తీసుకొస్తానని నమ్మానని చెప్పుకొచ్చారు. బైబిల్ ఒట్టేసి చెబుతున్నాు… నాకు ఎలాంటి రాజకీయ కాంక్ష లేదు. మిమ్మల్ని ఎప్పుడు పదవులు అడగలేదు.. దీని గురించి బైబిల్ పై ప్రమాణఁ చేస్తాను మీరు చేస్తారా అని షర్మిల ఎమోషనల్ అయి కంట తడి పెట్టారు.

ఆర్థిక సాయం అడిగినట్లుగా నిరూపించగలరా ?

కుటుంబంలో తాను తప్ప ఎవరూ రాజకీయాల్లో ఉండకూడదన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. అవినాష్ రెడ్డి బంధువు కాదా అని ప్రశ్నించారు. కమలాపురంలో పోటీ చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి బందువ కాదా అని ప్రశ్నించారు. పైగా తనపై నిందలు వేస్తున్నారని ఏదో ఆర్థిక సాయం, పనులు అడిగారని.. వాటిని ఇచ్చేందుకు జగన్ నిరాకరించినందునే తాను బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. పైసా సాయం అడిగినట్టు నిరూపించగలరా అని వైఎస్ జగన్ కు షర్మిల సవాల్ చేశారు. రాజశేఖర్ కొడుకు అనే మాట మర్చిపోయారని విలువల్లేకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.