BSNLను ఇక తట్టుకోలేరు భయ్యా.. అతి తక్కువ ధరకే 3 నెలలు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా!

www.mannamweb.com


దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. రీఛార్జ్‌ల విషయంలో వీరంతా 28 రోజుల వాలిడిటీ లేదా 3 నెలల వాలిడిటీ అందిచే రీఛార్జ్ ప్లాన్‌లను ఎక్కువగా ఇష్టపడతారు.

అయితే కొందరు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందడానికి 365 రోజులు అంటే దాదాపు 1 సంవత్సరం వాలిడిటీ అందించే ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుంకుంటారు. అయితే మీరు రోజుకు 1.5 GB డేటా, ఇతర ప్రయోజనాలతో వచ్చే సుమారు 3 నెలల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా బీఎస్ఎన్ఎల్ అందించే రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jio
రిలయన్స్ జియో డైలీ 1.5 GB డేటాతో 799 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. దీనితో మీరు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో యాప్‌ల ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. వీటన్నింటితో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా లభిస్తుంది.

Airtel
ఎయిర్‌టెల్ గురించి మాట్లాడుతే ఈ కంపెనీ డైలీ 1.5GB డేటాను 84 రోజుల పాటు రూ. 859కి అందిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ థాంక్స్ రివార్డ్‌ల బెనిఫిట్ కూడా వస్తుంది. దీని ద్వారా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ RewardsMini123 మెంబర్‌షిప్ అందుబాటులో ఉంది.

Vodafone Idea
వోడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు రూ. 859 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీనితో మీరు ప్రతిరోజూ 1.5GB డేటా, డైలీ 100 ఎస్ఎమ్ఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ పొందుతారు. ఇది కాకుండా Vi Hero అన్‌లిమిటెడ్ బెనిఫిట్ ఈ ప్లాన్‌తో లభిస్తుంది. మీరు అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను ఉపయోగించవచ్చు.

BSNL
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే బీఎస్ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. BSNL నుండి కేవలం రూ. 485తో మీరు ప్రతిరోజూ 1.5GB డేటా, 100 SMSలు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అయితే BSNL ఈ రూ. 485 ప్లాన్ 84 రోజులు కాకుండా 82 రోజుల వాలిడిటీతో వస్తుంది. దీంతో ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. అయితే, మీ అవసరాలకు అనుగుణంగా ఏ కంపెనీ ప్లాన్ ఉపయోగపడుతుందో మీరే నిర్ణయించుకోవాలి.