టాటా పంచ్ కారు ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. 1.64 లక్షలకు పైగా కార్లు అమ్ముడై మారుతి వ్యాగన్ఆర్‌ను వెనక్కి నెట్టింది. ఇంతకీ ఈ కార్ల ఉన్న అంత ప్రత్యేకత ఏంటి.? ఎందుకు ఇంతలా అమ్ముడు పోయాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
త్యధికంగా అమ్ముడవుతున్న 5 స్టార్ రేటింగ్ కారు – టాటా పంచ్!
2024లో టాటా పంచ్ దేశంలో నెంబర్-1 కారుగా నిలిచింది. గత ఏడాది రెండు లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ కారుకు డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో, పంచ్ 1.64 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో, గత ఏడాది మాదిరిగానే మారుతి వ్యాగన్ఆర్ వెనుకబడి ఉంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి ఎర్టిగా, మారుతి బ్రెజ్జా, మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో వంటి దాదాపు అన్ని ప్రముఖ మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. 1.50 లక్షలకు పైగా కార్లు అమ్ముడైన 5 మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో (10 నెలలు) అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవో చూద్దాం.
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు
2024- 2025 ఆర్థిక సంవత్సరం 10 నెలల అమ్మకాలను చూస్తే, టాటా పంచ్ 1,64,294 కార్లు, మారుతి వ్యాగన్ఆర్ 1,61,397 కార్లు, హ్యుందాయ్ క్రెటా 1,60,495 కార్లు, మారుతి ఎర్టిగా 1,59,302 కార్లు, మారుతి బ్రెజ్జా 1,57,225 కార్లు, మారుతి స్విఫ్ట్ 1,45,626 కార్లు, మారుతి బాలెనో 1,39,324 కార్లు, మహీంద్రా స్కార్పియో 1,37,311 కార్లు, మారుతి డిజైర్ 1,34,867 కార్లు, టాటా నెక్సాన్ 1,31,374 కార్లు అమ్ముడయ్యాయి.
1,31,086 యూనిట్లు మారుతి ఫ్రాంక్స్, 1,02,859 యూనిట్లు మారుతి గ్రాండ్ విటారా, 98,547 యూనిట్లు హ్యుందాయ్ వెన్యూ, 88,899 యూనిట్లు టయోటా ఇన్నోవా క్రిస్టా/హైక్రాస్, 83,824 యూనిట్లు మారుతి ఆల్టో, 54,322 యూనిట్లు టాటా టియాగో, 52,485 యూనిట్లు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, 47,434 యూనిట్లు హ్యుందాయ్ i20, 45,074 యూనిట్లు హ్యుందాయ్ ఆరా, 40,742 యూనిట్లు టయోటా గ్లాంజా అమ్ముడయ్యాయి.
బెస్ట్ బడ్జెట్ కారు
టాటా పంచ్ ఎక్కువ అమ్ముడుపోవడానికి ఈ కారు ధరే కారణమని చెప్పొచ్చు. టాటా పంచ్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ ను అందించారు. దీని ఇంజన్ 6000 rpm వద్ద గరిష్టంగా 86 bhp శక్తిని, 3300 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీంతో పాటు, కస్టమర్లకు 5-స్పీడ్ AMT ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 18.97 kmpl, ఆటోమేటిక్‌లో 18.82 kmpl మైలేజీని టాటా పంచ్ ఇస్తుంది. ఇక టాటా పంచ్ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
ఫీచర్స్ అదుర్స్
ఫీచర్ల విషయానికొస్తే ఈ కారులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో AC, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్టడ్ కార్ టెక్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు. అలాగే భద్రత కోసం టాటా పంచ్‌కు గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ లభించింది. టాటా నెక్సాన్ తర్వాత, ఇప్పుడు టాటా పంచ్‌కు గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ భద్రతా రేటింగ్ లభించింది. గ్లోబల్ NCAPలో, టాటా పంచ్‌కు పెద్దల భద్రత కోసం 5-స్టార్ రేటింగ్ (16,453) అలాగే పిల్లల భద్రత కోసం 4-స్టార్ రేటింగ్ (40,891) లభించింది.