కార్లు, బైక్‌లకు.. ఈ మధ్య కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు కంపెనీలు అధునాతన టెక్నాలజీతో పాటు ఇతర సౌకర్యాలు కూడా తీసుకొస్తున్నాయి.
మనం తరచూ చూసే అలాంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి మనకు పూర్తిగా తెలియదు. దానిని ఎలా వాడాలో.. ఎందుకు వాడుతారో.. అర్థం కాదు. అలాంటి వాటిలో కారు గ్రాబ్ హ్యాండిల్ ఒకటి. కారు డోర్ల పైన ఉండే హ్యాండిల్స్‌ని మీరంతా చూసి ఉంటారు. కానీ ఈ హ్యాండిల్స్ వల్ల అసలైన ప్రయోజనమేంటో తెలుసా? వాటిని డోర్లపైనే ఎందుకు ఉంచారు? మధ్యలో ఎందుకు ఉంచలేదో అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? చాలా మందికి వీటి ఉపయోగం గురించి తెలియదు.
కారులో పట్టుకొని కూర్చునేందుకే.. గ్రాబ్ హ్యాండిల్స్ వాడుతారని చాలా మంది భావిస్తారు. డ్రైవర్ కారును చాలా వేగంగా తిప్పినప్పుడు..లోపల కూర్చున్న వ్యక్తి దానిని పట్టుకుంటారు. అటూ ఇటు తూలకుండా గ్రామ్ హ్యాండిల్ సాయం తీసుకుంటారు. గ్రామ్ హ్యాండిల్‌ను వాడేది ఇందుకే అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి గ్రాబ్ హ్యాండిల్స్‌ను వాడేది దీని కోసం కాదు. వీటిని ఇన్‌స్టాల్ చేయడం వెనక వేరే ఉద్దేశం ఉంది. ఎవరి సహాయం లేకుండా కారులో కూర్చోలేని, దిగలేని వారి కోసమే.. గ్రాబ్ హ్యాండిల్‌ను ఏర్పాటు చేశారట. వాటిని పట్టుకోవడం ద్వారా వారు సులభంగా ఎక్కవచ్చు. దిగవచ్చు.
వికలాంగులు, వృద్ధులు, గర్భిణుల కోసమే కార్లలో ఈ గ్రాబ్ హ్యాండిల్స్ ఇన్‌స్టాల్ చేశారు. ఎవరైనా వీల్ చైర్‌లో వచ్చినప్పుడు వాళ్లు.. వారు సులభంగా గ్రాబ్ హ్యాండిల్ పట్టుకుని లోపలికి వెళ్లొచ్చు. అందుకే దీన్ని తలుపులకు మాత్రమే అమర్చారు. ఒకసారి లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత.. ప్రయాణికుల కోసం ఆర్మ్ రెస్ట్‌లు, ఆటోమేటిక్ లాక్ షోల్డర్ సీట్ బెల్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇది రద్దీగా ఉండే ప్రయాణాలలో ప్రయాణికులకు మంచి సౌకర్యవంతమైన అనుభూతి కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో గ్రాబ్ హ్యాండిల్స్ వాడకం చాలా తక్కువగా ఉన్నప్పటికీ..కంపెనీలు మాత్రం వాటిని ఇంకా తయారుచేస్తూనే ఉన్నాయి.
ఇక కారు లేదా బస్సులో స్టీరింగ్ మధ్యలో ఎందుకు ఉండదనే ప్రశ్న కూడా మీలో చాలా సార్లు మెదిలే ఉంటుంది. స్టీరింగ్ కుడి లేదా ఎడమ వైపునకు ఉంటుంది. మన దేశంలో కుడి వైపు స్టీరింగ్ ఉంటుంది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో దానిని ఎడమ వైపున బిగిస్తారు. స్టీరింగ్ మధ్యలో ఉంచకపోవడానికి ఓ కారణం ఉంది. మధ్యలో కాకుండా.. సైడ్‌కు స్టీరింగ్ చేయడం వల్ల డ్రైవర్ ఈజీగా దూరాన్ని గమనించవచ్చని కారును డిజైన్ చేసే ఇంజనీర్లు చెబుతారు. డ్రైవర్లు కొంచెం ఎడ్జ్ తీసుకొని … ముందున్న వాహనంతో పాటు దాని ముందున్న వాహనాన్ని కూడా తెలుసుకోవచ్చు. తదుపరి వాహనం ముందు ఏ వాహనం కదులుతుందో తెలుసుకుంటాడు. ప్రస్తుతం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉన్న ప్రాంతాల్లో కుడివైపు.. రైడ్ హ్యాండ్ డ్రైవ్ ఉన్న ప్రాంతాల్లో ఎడమ వైపున స్టీరింగ్ ఉంటుంది. మన ఇండియాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉన్నందున.. వాహనాలకు కుడివైపున స్టీరింగ్ ఉంటుంది.