ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడులో కేసు నమోదైంది. పవన్ పై మదురైలో న్యాయవాది వాంజినాధన్ ముదురై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యల తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది.
తిరుమల లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చిన సమయం నుంచి పవన్ కల్యాణ్ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. లడ్డూ వివాదం తో పశ్చాత్తాప దీక్ష స్వీకరించిన పవన్ తిరుమలలో విరమించారు. తిరుపతిలో జరిగిన వారాహి సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ స్పందించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పవన్ తన పైన చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ వేచి చూద్దామంటూ పేర్కొన్నారు. అయితే, పవన్ చేసిన వ్యాఖ్యల పైన మాత్రం న్యాయవాది వాంజినాధన్ ముదురై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదులో వివరించారు. సనాతన ధర్మం కోసం ఎలాంటి త్యాగానికి అయినా తాను సిద్దమని తిరుపతి సభలో పవన్ ప్రకటించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యల పైన డీఎంకే స్పందించింది. తమ పార్టీ ఎప్పుడూ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.