cash deposit limit : అకౌంట్‌లో ఇంతకంటే ఎక్కువ జమ చేస్తే జరిమానాలే.. జర జాగ్రత్త!

www.mannamweb.com


cash deposit limit : అకౌంట్‌లో ఇంతకంటే ఎక్కువ జమ చేస్తే జరిమానాలే.. జర జాగ్రత్త!

Cash deposit limit : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ సేవింగ్స్‌ అకౌంట్‌ అనేది తప్పని సరిగా ఉంటోంది. అయితే వాటి నుంచి మీ పక్కింటి వారివి, ఎదురింటి వారివి, ఫ్రెండ్స్‌వి ఇలా ఎవరివి బడితే వారివి పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం అటూ ఇటూ ట్రాన్స్‌వర్‌ చేయకండి.

అవి అన్నీ మీ ఇన్‌కం ట్యాక్స్‌ లెక్కల కిందికి వస్తాయి. ఐటీ డిపార్ట్‌మెంట్‌ మీ అకౌంట్‌ను పరిశీలించి ఫైన్‌ వేసే అవకాశం ఉంటుంది. మరి అసలు మీ అకౌంట్‌లో ఎంత డబ్బును జమ చేయవచ్చు? అనే విషయంలో ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌(income tax department) మార్గదర్శకాలను(guidelines) విడుదల చేసింది. అవి ఏంటో తెలుసుకుందాం రండి.

క్యాష్‌ డిపాజిట్‌ నిబంధనలు :సేవింగ్స్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేయడానికి సంబంధించిన రూల్స్‌ ఇలా ఉన్నాయి. అకౌంట్‌లో ఒకేసారి రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్‌ చేయాలంటే బ్యాంక్‌ వారికి తప్పనిసరిగా పాన్‌ నెంబర్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా రోజుకు లక్ష రూపాయల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు.
* అలాగే నాన్‌ రెగ్యులర్‌ క్యాట్‌ డిపాజిటర్లు అయితే 2.50లక్షల వరకు పాన్‌ కార్డ్‌ లేకుండా డిపాజిట్‌ చేయవచ్చు. ట్యాక్స్‌ కట్టే వారు అందరూ తమ అన్ని రకాల అకౌంట్లలోనూ కలిపి పది లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు.
* పదిలక్షలకు మించి డబ్బులు డిపాజిట్‌ చేసినట్లు లెక్కలు కనిపిస్తే ఆ అకౌంట్‌ని ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పరిశీలిస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఏ విధంగా మీకు సంక్రమించింది అనే విషయంలో సేటిస్ఫేక్టరీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ మొత్తంపై జరిమానాలు వేసే అధికారం ఐటీ డిపార్ట్‌మెంట్‌కు(income tax department) ఉంటుంది.