త్వరలో సీబీఎస్ఈ CTET-2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) నిర్వహించే సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CTET) 2026 రిజిస్ట్రేషన్‌ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌ ctet.nic.in లో ప్రారంభం కానుంది.


ఫిబ్రవరి 8, 2026న సీటెట్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అంటే సిలబస్‌, లాంగ్వేజెస్, అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరిక్షా సెంటర్ వివరాలు, ముఖ్యమైన తేదీలు మొదలైనవి త్వరలో సీటెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్న నోటిఫికేషన్‌లో పొందుపరచనున్నారు.

CTET 2026 పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే.. ఈ ప్రోసిజర్ ను ఫాలో అవ్వాలి. మొదట అధికారిక వెబ్‌సైట్‌ ctet.nic.in ను సందర్శించాలి. ఆ తరువాత ‘Apply for CTET 2026’ లింక్‌పై క్లిక్‌ చేయాలి. కొత్త రిజిస్ట్రేషన్‌ చేసి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పరీక్ష కేంద్రం, పేపర్‌ (I లేదా II లేదా రెండూ), ప్రాధాన్య భాషను ఎంచుకోవాలి. అవసరమైన ఫార్మాట్‌లో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. ఫామ్ ను సబ్మిట్‌ చేసి, కన్ఫర్మేషన్‌ పేజీని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి.

CTET 2026 దరఖాస్తు రుసుమును ఇలా నిర్ణయించారు. జనరల్‌, OBC అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.1,200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwD అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. CTET 2026 పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. తరగతులు I నుంచి V బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్‌ I నిర్వహిస్తారు.తరగతులు VI నుంచి VIII బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్‌ II నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. ఎలాంటి నెగటివ్‌ మార్కింగ్‌ ఉండదు.ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ ctet.nic.in

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.