చిన్న వయసులో తల్లిదండ్రుల్ని కోల్పోయి, ఇద్దరిలో ఒకరిని కోల్పోయి ఇబ్బందిపడుతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అంత చిన్న వయసులో సరైన ఆదరణ లేక చదవును మధ్యలోనే ఆపేసివారు..
చదువుకు దూరమవుతున్నవారు కూడా చాలామంది ఉన్నారు. అలా చదవుకు పేద పిల్లలు దూరం కాకూడదనే గొప్ప ఉద్దేశంతో ఓ స్కూల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ కోనేరు సత్యప్రసాద్.. దాని పేరే ‘హీల్ ప్యారడైజ్’. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో ఏకంగా 90 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ స్కూల్ ఉంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు ఉచితంగా చదువుకోవచ్చు. కార్పొరేట్ స్థాయిలో, సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియంలో చదవుకునే అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులకు చదుతో పాటుగా వసతి, మంచి రుచికరమైన భోజనం కూడా ఉచితంగా అందిస్తారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి 12 కిలోమీటర్ల దూరంగా ఉంంది.
హీల్ ప్యారడైజ్ విద్యాసంస్థలో ఆధునిక సౌకర్యాలతో బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ ఉంది. విద్యార్థులకు అందించే భోజనంలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను వాడుతున్నారు. వంట చేయడానికి సోలార్ వంటగది.. విద్యార్థులు తాగడానికి ఆర్వో ద్వారా శుద్ధి చేసిన నీరు, వేడినీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ గదుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ కోసం సౌకర్యాలు, ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు క్రీడల్లో జాతీయ, రాష్ట్రస్థాయి సత్తా చాటుతున్నారు.
ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ కేంద్రం, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎక్స్‌లెన్స్, సైబర్ సెక్యూరిటీ కేంద్రం, 3డీ ప్రింటింగ్, డిజైన్ థింకింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్‌తో వస్తువులను త్రీ-డైమెన్షనల్, డిజైన్ థింకింగ్ వంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ స్కూల్‌లో చదివినవారు మెడికల్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదవడానికి హీల్ సంస్థ సహాయం చేస్తుంది. విద్యార్థుల ఆరోగ్యం కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఒక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. అత్యుత్తమ అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు, అంతర్జాతీయ స్థాయి ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందిస్తారు. ఈ స్కూల్‌లో దేశంలోని ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా చేరొచ్చు. స్కూల్‌లో పెద్ద లైబ్రరీ ఉంది.. అందులో 15 వేల పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తి మేరకు కళల్లోనూ (త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం) ప్రోత్సహిస్తున్నారు.. శిక్షణ ఇస్తారు.
2026-27 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు.. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ కోర్సులలో చేరొచ్చు. అంతేకాదు హీల్ అంధుల స్కూల్‌లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 1 నుంచి 9 తరగతులకు సంబంధించి.. తల్లిదండ్రులను కోల్పోయి, ఎవరినో ఒకరిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న విద్యార్థులు 6 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులు అర్హులు. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు సంబంధించి డెత్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు హీల్ విద్యా సంస్థ హీల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో పాస్ కావాల్సిందే.
ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏలో చేరాలంటే.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు పదో తరగతిలో 480 మార్కుులు.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో 400పైన మార్కులు సాధించాలి.. వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరు కూడా ఆదాయ ధ్రువ పత్రం, తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. అంధ పాఠశాలకు సంబంధించి.. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులు ప్రవేశాలకు ఆర్థికంగా వెనుకబడి, 40శాతం కంటే ఎక్కువ అంధత్వ ధ్రువపత్రం ఉన్నవారు అర్హులు. 2026 ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. మరిన్ని వివరాలకు 9100024438, 9100024435 నంబర్లను సంప్రదించొచ్చు. స్కూల్ వెబ్‌సైట్ : www.healschool.co.in.


































