సమ్మర్ సీజన్ కాకపోయినా.. ఎండాకాలం దాదాపు వచ్చేసినట్టే అనిపిస్తోంది. అప్పుడే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇంట్లో ఉండే ఫ్యాన్‌కు బాగా పని పడుతుంది.
ఇప్పటివరకూ వేసీ వేయట్టు ఫ్యాన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లోని ఫ్యాన్లు గిర్రునా తిరుగుతూనే ఉంటాయి. అయితే ఫ్యాన్‌పై పేరుకుపోయిన దుమ్మును వదిలించడం అంటే మామూలు పని కాదు. ఇంటిని అప్పుడప్పుడూ శుభ్రం చేసినా.. ఫ్యాన్‌ని మాత్రం ఏ పండుగలకో శుభ్రం చేస్తారు. దీంతో దుమ్ము ఎక్కువగానే పేరుకుపోతుంది.
దుమ్ము ఎక్కువగా ఉంటే ఫ్యాన్ స్పీడుగా తిరగదు. తడిగుడ్డతో తుడిచినా పెద్దగా ఫలితం ఉండదు. నల్లగా మరకలు ఉంటాయి. అయితే ఈసారి ఈ ట్రిక్స్ ఫాలో అయి చూడండి. ఫ్యాన్‌కు ఉన్న దుమ్ము, ధూళి పోయి.. స్పీడుగా తిరుగుతుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
వెనిగర్:
వెనిగర్‌తో ఎలాంటి మరకలైనా.. డస్ట్‌ని అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్‌తో కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్ తళతళమని మెరిసిపోతుంది. ఒక గిన్నెలోకి వెనిగర్, కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ మీద వేయండి. ఆ తర్వాత ఒక తడి క్లాత్ తీసుకుని దానితో ఫ్యాన్‌ని తుడవండి. కొద్ది క్షణాల్లోనే ఫ్యాన్‌పై ఉండే దుమ్ము వదులుతుంది.
ఆలీవ్ ఆయిల్:
ఆలీవ్ ఆయిల్‌తో కూడా ఫ్యాన్ కు పట్టిన దుమ్మును ఫాస్ట్‌గా వదిలించుకోవచ్చు. ఫ్యాన్ రంగు కూడా మారకుండా ఉంటుంది. ముందుగా పైపైన ఉన్న దుమ్మును తుడిచేసి.. ఆ తర్వాత కొద్దిగా ఆలీవ్ ఆయిల్ రాయండి. నెక్ట్ కాటన్ క్లాత్ సహాయంతో ఫ్యాన్‌ని తుడవండి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్‌కు పట్టని దుమ్ము మొత్తం వదులుతుంది. ఆలీవ్ ఆయిల్ ప్లేస్‌లో కొబ్బరి నూనెను కూడా ఉపయోగించుకోవచ్చు.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాతో కిచెన్‌లో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఫ్యాన్‌పై ఉండే దుమ్మును కూడా త్వరగా వదిలించుకోవచ్చు. ఏదైనా సబ్బు నీళ్లలో బేకింగ్ సోడాను కలుపుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ లేదా స్పాంజీ తీసుకుని ఫ్యాన్‌పై తుడవండి. ఈజీగా దుమ్ము వచ్చేస్తుంది. ఇలా ఇంట్లోనే ఉండే వాటితో ఫ్యాన్ దుమ్మును వదలించుకోవచ్చు.