8వ వేతన కమిషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర క్యాబినెట్ 8వ వేతన కమిషన్‌కు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ పే కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.


18 నెలల్లో కమిషన్ ప్రతిపాదనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. అలాగే రబీ సీజన్‌లో రైతులకు పోషక ఆధారిత సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వాహనాలకు ఢిల్లీలో ప్రవేశం నిషేధం. బీఎస్-6 ఇంజన్ లేని వాహనాలకు కూడా అనుమతి నిరాకరించనున్నారు. రోజురోజుకు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకుని, పాత వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రూ.37,952 కోట్ల ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.