రూ.7 లక్షలు ఉచితంగా పొందే కేంద్ర ప్రభుత్వ పథకం..వెంటనే ఇలా అప్లై చేసుకోండి

 దేశంలోని ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం కూడా ఒకటి. ఉపాధి లేక ఆర్తిక ఇబ్బందులతో చాలా మంది యువత ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి కోసం కేంద్రం తీసుకువచ్చిన పథకాలలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) ఒకటి.


ఈ పథకం ద్వారా రూ.లక్ష నుండి రూ.యాభై లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా లోన్ తీసుకున్న తరవాత అందులో 35 శాతం వరకు రాయితీ ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు రూ.20 లక్షల లోన్ తీసుకుంటే అందులో రూ.7 లక్షల వరకు మాఫీ అవుతుంది. కాబట్టి మీరు ఉచితంగా రూ.7 లక్షలు పొందవచ్చు. పీఎంఈజీపీ పథకం ద్వారా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి రూ.50 లక్షల వరకు ఇస్తారు.

అంతే కాకుండా సర్వీస్ అందించే వ్యాపార యూనిట్లకు అయితే రూ.20 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది. లోన్ కోసం మొదటగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు మరియు దివ్యాంగులు అయితే 5 శాతం పెట్టుబడి పెట్టాలి. జనరల్ కేటగిరికి చెందినవారైతే 10 శాతం వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో వ్యాపార యూనిట్లు ప్రారంభిస్తే లోన్ పై 25శాతం రాయితీ ఉంటుంది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తే 35శాతం రాయితీ లభిస్తుంది. ఈ పథకం కోసం అప్లై చేసుకునేవాళ్లు www.kviconline.gov.in అనే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అప్లికేషన్ ఫారంపై క్లిక్ చేసి అడిగిన వివరాలను నమోదు చేయాలి.

అనంతరం దానిని ప్రింట్ తీసుకుని https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్ సైట్ కు వెళితే అక్కడ దరఖాస్తు ఫారం కనిపిస్తుంది దానిని నింపాలి. అప్లై చేసుకున్న తరవాత 10 నుండి 15 రోజుల్లో అధికారులు స్పందిస్తారు. మీరు ప్రారంభించే ప్రాజెక్టుపై నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఈ శిక్షణ అందిస్తారు. తరవాత లోన్ మంజూరు చేస్తారు. మీరు రుణం పొందిన తరవాత దానిని మూడేళ్లలో క్రమం తప్పకుండా కడితేనే మీకు రాయితీ లభిస్తుంది. ఒక కుటుంబంలో ఈ పథకానికి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కనీసం 8వ తరగతి వరకు చదువుకుని 18ఏళ్ల వయసు నిండినవాళ్లు ఈ పథకానికి అప్లై చేసుకోచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.