భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)- ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫొటోలను తొలగించాడు.
దీంతో వీరిద్దరూ కచ్చితంగా విడిపోతారనే ఊహగానాలు మరింత బలపడ్డాయి. అయితే.. చాహల్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినప్పటికీ అతడితో ఉన్న ఫొటోలను మాత్రం ధనశ్రీ తొలగించలేదు. ”వారిద్దరూ కచ్చితంగా విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కాస్త సమయం పడుతుంది. అయితే.. వీరిద్దరూ విడిపోయేందుకు కచ్చితమైన కారణాలు తెలీదు” అని సంబంధింత వర్గాలు వెల్లడించాయి.
కాగా.. ముంబయికి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వద్ద చాహల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్లేవాడు. అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట.. గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవడం లేదని తెలిపాడు. కానీ, తాజాగా భార్య ఫొటోలను తొలగించడంతో మరోసారి వీరి విడాకుల అంశం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.