ఐదు నిమిషాల్లోనే రెండు చైన్ స్నాచింగ్స్

గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో చైన్ స్నాచర్లు(Chain snatchers) రెచ్చిపోతున్నారు. బైక్‌పై వచ్చి రోడ్లపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో గొలుసులు లాక్కెళ్తున్నారు.


ఈ ఘటనల్లో మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు. నెల రోజులుగా వరుస చైన్ స్నాచింగుల పట్ల మహిళలను ఆందోళనలు చెందుతున్నారు. తాజాగా జరిగిన ఘటనలతో రోడ్లపై వచ్చేందుకు మహిళలు జంకిపోతున్నారు.

తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి(Kothur Anjaneya Swamy Temple) సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు(Gold Chain) లాక్కుని పారిపోయారు. అనంతరం ఐదు నిమిషాల్లోనే మరో చోట కూడా మహిళ మెడలో బంగారపు గొలుసు తెంపుకెళ్లారు. నెలరోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. ఈ ఘటన మరువకముందే మరో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరడగంతో స్థానికు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైన్ స్నాచింగుంలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.