Chanakya Niti Telugu : మహిళల్లో ఉండే ఈ చెడు లక్షణాలతో జీవితంలో ఇబ్బందులు

స్త్రీ ని శక్తితో పోలుస్తారు. కుటుంబాన్ని నిర్మించే శక్తి మహిళలకు ఉంది. అలాగే స్త్రీ మనసు పెడితే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా ఉంటుంది.
సమాజంలో మహిళలకు గౌరవ స్థానం ఉంది. చాణక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటే జీవితం బంగారుమయం అవుతుంది. అదేవిధంగా ఆమెలోని కొన్ని లక్షణాలు జీవితాన్ని నాశనం చేస్తాయని చాణక్యుడు తెలిపాడు. చాణక్యుడి ప్రకారం స్త్రీలకు ఉండకూడని లక్షణాలు ఏంటో చూద్దాం..


చాణక్య నీతి ప్రకారం స్త్రీలు పురుషుల కంటే అత్యాశ ఎక్కువ ఉంటుందని చాణక్యుడు తెలిపాడు. అది డబ్బు, నగలు, బట్టలు మొదలైనవి విషయాల్లో అయి ఉంటుంది. మనిషికి కోరిక ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. అది ఎప్పటికైనా డేంజర్. అతిగా అత్యాశతో ఉంటే మోక్షానికి అవకాశం లేదని చాణక్యుడు చెప్పాడు. దీనితో అనేక సమస్యలు వస్తాయి. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
చాణక్యుడు ప్రకారం మహిళలు ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించరు. ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొంచెం తడబడినా ప్రమాదంలో పడతారు. ఆలోచన లేకుండా చేసే పనులు విజయాన్ని ఇవ్వలేవు. ఆలోచిస్తేనే సరైనా అడుగులు పడతాయి. ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆలోచన లేకుండా ముందుకు వెళ్తే సమస్యలు కచ్చితంగా వస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకైనా సరిగా ముందుగు సాగాలి.

స్త్రీలలో కొందరు చాలా స్వార్థపరులు. మహిళలు తమ పనిని పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడతారు. ఈ గుణం కొందరికి ఉంటుంది. స్త్రీలు ఈ లక్షణాలను విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో కొన్ని విషయాలు జరిగితే జరుగుతాయి.. లేదంటే లేదు. దానికోసం కొన్ని కోల్పోవలసిన అవసరం లేదు. అలా చేస్తే మిమ్మల్ని చూసి ఇతరులు చెడుగా మాట్లాడే అవకాశం ఉంది.
చాణక్య నీతి ప్రకారం స్త్రీలకు ధైర్యం మంచిదే కానీ మితిమీరిన ధైర్యం మంచిది కాదు. మీ ఈ మితిమీరిన ధైర్యసాహసాలు మీకు ఏదో ఒక రోజు కష్టాల్లో పడేస్తాయి అని చాణక్యుడు చెప్పాడు. ఏం కాదులే అని కొన్నిసార్లు ముందుకు వెళ్లితే సమస్యలు తప్పవు. ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. మితిమీరిన ధైర్యం పురుషులకు కూడా మంచిది కాదు. ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే చాలు.
కొందరు స్త్రీలకు అబద్ధం చెప్పే అలవాటు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చెప్పే అబద్ధాలే వాళ్ళని కష్టాల్లో పడేస్తాయి. స్త్రీలు అలాంటి గుణాలను వదిలేయాలని చాణక్యుడు తెలిపాడు. ఈ గుణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురావని వివరించాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. స్త్రీలు కూడా ఈ లక్షణాలలో కొన్నింటిని మార్చుకోవాలి అని చాణక్యుడు వెల్లడించాడు.