చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని విషయాలను ఇతరులకు చెప్పకూడదు. వాటిని రహస్యంగా ఉంచడం వల్లనే విజయం సాధ్యమవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెక్స్ట్ స్టెప్
విజయవంతమైన వ్యక్తులు తమ ప్లాన్ కి సంబంధించి, ఆలోచనల గురించి ఎక్కువగా మాట్లాడరు. వారు మొదట కష్టపడతారు. వారి లక్ష్యం పూర్తయినప్పుడు మాత్రమే ప్రపంచానికి చూపిస్తారు. అసంపూర్ణ ప్రణాళికను చెప్పడం వల్ల విమర్శలు, ప్రతికూలత ఎదురవుతాయి. అందుకే మొదట కష్టపడండి, ఆపై చెప్పండి.
వ్యక్తిగత జీవితం
వ్యక్తిగత జీవితం (సంబంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి) గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు మీ బలహీనతలను ఉపయోగించుకోవచ్చు. మీ బలంపై దృష్టి పెట్టండి. అవసరమైనంత మాత్రమే ఇతరులకు చెప్పండి.
డబ్బుల విషయంలో జాగ్రత్త
మీ జీతం, ఆదాయ వనరులు, పొదుపులు, పెట్టుబడుల గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి. కొంతమంది అసూయపడవచ్చు, మీకు హాని కలిగించవచ్చు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. వాటిని రహస్యంగా ఉంచండి.
మంచి పనులు
మీరు ఎవరికైనా సహాయం చేస్తుంటే దానిని ప్రచారం చేయకండి. నిజమైన దానం ఎలాంటి ఆర్భాటం లేకుండా చేయడమే. ప్రదర్శన చేయడం వల్ల మీ మంచితనం తగ్గిపోయి ప్రచారం ఎక్కువ అవుతుంది.
భయం
మీ సమస్యలు, భయాల గురించి ప్రతి ఒక్కరితో మాట్లాడకండి. కొంతమంది మీ బలహీనతను తెలుసుకొని మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నించవచ్చు. మీ వైఫల్యాల నుండి నేర్చుకోండి. కానీ మీరు ఎన్నిసార్లు పడిపోయారో ప్రపంచానికి చెప్పకండి. ఓటమిని దాచి.. విజయాన్ని మాత్రమే చూపించండి.
కుటుంబ సమస్యలు
కుటుంబ కలహాలు, సంబంధిత సమస్యలు వ్యక్తిగతమైనవి. ఇతరులకు చెప్పడం వల్ల వారు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు లేదా దానిని దుర్వినియోగం చేయవచ్చు. సంతోషకరమైన జీవితం కోసం కుటుంబ విషయాలను ఇంటికే పరిమితం చేయండి.