ఇంట్లో ఉండే సంపాదించాలని ఎంత మందికి ఉండదు? జాబ్ ప్రెజర్, ట్రాఫిక్‌లో టైమ్ వేస్ట్.. ఇవేవీ ఉండవు. స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇలాంటి కలలు చాలా మందికి ఉంటాయి.
కానీ సరైన మార్గం తెలియక చాలా మంది రాంగ్ రూట్‌లోకి అడుగుపెడతారు. త్వరగా రిచ్ అవ్వొచ్చంటూ ఊదరగొట్టే స్కామ్‌లు, MLM స్కీమ్‌ల ట్రాప్‌లో పడి కనీసం ఇంటర్నెట్ బిల్లుకు కూడా సరిపోని రిటర్న్స్ పొందేవాళ్లు ఎంతో మంది. ఇప్పుడు అంతా ChatGPT ట్రెండ్ నడుస్తోంది. ఈ టెక్ అసిస్టెంట్ మీతో 24/7 ఉంటుంది. దీని సాయంతో మీ స్కిల్స్‌ను కాసులుగా మార్చుకోవడం చాలా ఈజీ. అలాంటి ఐదు స్మార్ట్ ఐడియాలేంటో చూద్దాం.
* రీసెర్చ్ బిజినెస్
కంపెనీలకు డెసిషన్స్ కోసం డేటా కావాలి. కానీ రీసెర్చ్‌కి టైమ్ ఉండదు. ChatGPTతో రోజుల్లోనే డీప్ రీసెర్చ్ చేసి రిపోర్ట్స్ ఇవ్వొచ్చు. మార్కెట్ ట్రెండ్స్, కాంపిటీటర్ అనాలిసిస్ లాంటివి బిజినెస్‌లకు ఆఫర్ చేయొచ్చు. ChatGPT డేటాను ప్రాసెస్ చేసి, పాలిష్డ్ రిపోర్ట్స్ ఇస్తుంది. ఇతర AI టూల్స్‌తో ఫాక్ట్ చెక్ చేస్తే క్వాలిటీ పెరుగుతుంది. ఒక్కో ప్రాజెక్ట్‌కి రూ.80,000 – 4 లక్షల వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇంట్లోనే ఈ సర్వీస్ నడపొచ్చు. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఉండదు.
* ఘోస్ట్ రైటింగ్
పెద్ద కంపెనీ CEOలు తమ బ్రాండ్‌ని సోషల్ మీడియాలో బిల్డ్ చేయాలనుకుంటారు. లింక్డ్‌ఇన్‌లో పోస్ట్‌లు రాయడానికి వాళ్లకు టైం ఉండదు. మీరు వాళ్ల కోసం సీక్రెట్‌గా రాయొచ్చు. వాళ్లను వారానికోసారి ఇంటర్వ్యూ చేసి, ChatGPTతో స్టోరీలను కంటెంట్‌గా మార్చుకోవచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టెంప్లేట్స్ రెడీ చేసి, ఒక చాట్‌ని వీక్స్ తరబడి పోస్ట్‌లుగా షెడ్యూల్ చేయొచ్చు. వాళ్లు ఓకే చెప్పాక అప్‌లోడ్ చేస్తే సరి. ఒకవేళ CEO హ్యాపీ అయితే, వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా నీ ఘోస్ట్‌రైటింగ్ బిజినెస్ గ్రో అవుతుంది. రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటే ఈ ఫీల్డ్‌లో రాణించొచ్చు.
* ఈమెయిల్ సర్వీస్
ఈమెయిల్ మార్కెటింగ్ డిజిటల్ వరల్డ్‌లో బెస్ట్ ROI ఇస్తుంది. బిజినెస్‌లకు వెల్‌కమ్ ఈమెయిల్స్, సేల్స్ ఫన్నెల్స్, న్యూస్‌లెటర్స్ కావాలి. కానీ ఎంగేజింగ్‌గా రాసే టాలెంట్ వాళ్లకు ఉండదు. ChatGPTతో నీవు ఈ అవకాశాన్ని గ్రాబ్ చేయొచ్చు. పర్సువేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుని, అన్ని ఇండస్ట్రీలకు సూట్ అయ్యే టెంప్లేట్స్ క్రియేట్ చేయి. ఒక్కో ఈమెయిల్‌కి రూ.4000-12000 ఛార్జ్ చేయొచ్చు. లేదా మంత్లీ ప్యాక్‌లు చేయొచ్చు.
* AI ట్రైనింగ్
చాలా కంపెనీలు ఇప్పుడు AI వాడాలనుకుంటాయి. కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఈ స్కిల్ గ్యాప్ మీకు మంచి అవకాశం. ChatGPT లాంటి టూల్స్‌ని ప్రొఫెషనల్స్‌కి నేర్పే కోర్సులుగా డిజైన్ చేసుకోవచ్చు. తెలిసిన ఫీల్డ్‌లో వీడియో ట్యుటోరియల్స్ తీసి, రెడీమేడ్ ప్రాంప్ట్స్ ఇవ్వొచ్చు. రియల్ ఉదాహరణలతో కోచింగ్ కాల్స్ ఆఫర్ చేస్తే, వాళ్లు ఈజీగా అప్లై చేస్తారు. ఒక ఇండస్ట్రీలో మొదలు పెట్టి, డిమాండ్ పెరిగినప్పుడు ఎక్స్‌పాండ్ చేయొచ్చు. ఈ బిజినెస్ ఇంట్లో స్టార్ట్ చేసి, గ్లోబల్ క్లయింట్స్‌తో గ్రో చేయొచ్చు.
* డిజిటల్ ప్రొడక్ట్స్
ప్రాబ్లమ్స్‌కి షార్ట్‌కట్స్ కావాలని అందరూ చూస్తారు. డిజిటల్ ప్రొడక్ట్స్ ఈ డిమాండ్‌కి పర్ఫెక్ట్. ఒకసారి క్రియేట్ చేస్తే, అవి నీకు ప్యాసివ్ ఇన్‌కం ఇస్తాయి. ChatGPT సాయంతో ఈ-బుక్స్, గైడ్స్, కోర్సులు ఫాస్ట్‌గా తయారు చేయొచ్చు. తెలిసిన టాపిక్ ఎంచుకోవచ్చు లేదా గూగుల్ ట్రెండ్స్‌లో ప్రజలు ఏం సెర్చ్ చేస్తున్నారో చూసి డిసైడ్ చేసుకోవచ్చు. సేల్స్ పేజీలు, ఈమెయిల్ క్యాంపెయిన్స్ రాసి మార్కెట్ చేయవచ్చు. రూ.2000-8000 రేంజ్‌లో స్టార్ట్ చేస్తే, మీ అకౌంట్‌లో నెలకు రెగ్యులర్‌గా డబ్బు వచ్చి పడుతుంది. వీ ఎక్స్‌పర్టైజ్‌ని బ్రాండ్‌గా బిల్డ్ చేసుకొని బాగా సంపాదించవచ్చు.