స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను చార్జిషీట్‌లో చేర్చారు. ఈ చార్జిషీట్‌ను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు. ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసులోనూ సీఐడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. అంతకుముందు ఇదే కేసులో దాదాపు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.