వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో చేసిన ఘన కార్యాలను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ పద్దతి ప్రకారంగా తూర్పారబట్టారు.
సీఎం కుర్చీలో కూర్చుని జగన్ చేసిన నిర్వాకాలను ప్రస్తావిస్తూ…అందుకు ప్రతిగా జగన్ ను అరెస్ట్ చేయడం తనకు పెద్ద పనేమీ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమే మరి… సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భాగంగా సెకీతోనే జగన్ సర్కారు ఒప్పందం చేసుకున్నా,… అదానీ పవర్ అధినేత గౌతమ్ అధానీతో జగన్ అంతగా రాసుకుపూసుకు తిరగాల్సిన అవసరం ఏమిటన్నదానిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. అదానీ తనకు మిత్రుడు అయితే మాత్రం గతంలో ఎన్నడూ లేనన్ని సార్లు ఆయనను జగన్ తన ఇంటికి ఎందుకు ఆహ్వానించారని జనం ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని సార్లు జగన్ ఇంటికి అదానీ రహస్యంగా వచ్చి వెళ్లిన వైనాన్ని కూడా జనం బహాటంగానే నిలదీస్తున్నారు. మొత్తంగా ఎదో ఆయాచిత లబ్ధి లేకుంటే… జగన్ ఇంటికి అదానీ అన్నేసి సార్లు రారు కదా అంటూ… జగన్ కు ముడుపులు ముట్టజెప్పేందుకే అదానీ వచ్చారని జనం ఆ నిర్ధారణకు అయితే వచ్చేశారు. ముడుపులు స్వీకరించడం అంటే… నేరం చేసినట్టే కదా. అమెరికా కోర్టుల్లో నమోదైన కేసుల్లో అదానీ సంస్థలు ఏపీ ప్రభుత్వంలోని అధికారులతో పాటుగా సీఎంగా ఉన్న నేతకు భారీ ఎత్తున ముడుపులు అందజేశారని చాలా స్పష్టంగానే నేరారోపణలు జరిగాయి. నాడు ఏపీ సీఎంగా ఉన్నది జగనే కదా.
మరి అదానీ వద్ద నుంచి సెకీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసేందుకు జగన్ లంచం తీసుకున్నట్లే కదా. అంటే… తప్పు చేసినట్టే కదా. మరి తప్పు చేసిన వ్యక్తిని చట్టం అరెస్ట్ చేస్తుంది కదా. ఆ వ్యక్తి రాజకీయ నేత అయితే… అలాంటి వ్యవహారం సదరు నేత ప్రత్యర్థులకు మంచి అవకాశమే కదా. లడ్డూ లాంటి ఇంత మంచి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఎవరూ వదులుకోరు. కక్షసాదింపు రాజకీయాలకు పాల్పడే నేతలు అస్సలు వదులుకోరు. చంద్రబాబు అయితే వదులుకుంటారు.ఎందుకంటే…కక్ష సాధింపు రాజకీయాలకు చంద్రబాబు అల్లంత దూరాన నిలబడతారు కదా.
అందుకే… తప్పు చేసినట్లుగా జగన్ పై బలమైన ఆధారాలు ఉన్నా…అరెస్ట్ కాకుండా జగన్ పండుగలు చేసుకుంటూ దిలాసాగా తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితే జగన్ కు చేజిక్కి ఉండి ఉంటే… చంద్రబాబు క్షణాల్లోనే అరెస్టై జైల్లో కూర్చునే వారు. ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేని స్కిల్ కేసులోనే… చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున అందినకాడికి దోచుకున్నారన్న కేసులో జగన్ 16నెలల పాటు జైల్లో ఉన్నారు. తన మాదిరే తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు కూడా జైలుకు వెళ్లి తీరాల్సిందేనన్న పంతంతో జగన్ సాగారు. ఈ కారణంగానే ఆధారాలు లేకపోయినా… చంద్రబాబు అరెస్టయ్యారు. 50 రోజులకు పైగా జైలులో ఉన్నారు. ఈ ఘటన చంద్రబాబు జీవితంలోనే మరిచిపోలేని ఘటన. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదో పెద్ద మచ్చగానే నిలిచిపోతుంది. ఇదే రీతిన చంద్రబాబు ఆలోచించి ఉండి ఉంటే…జగన్ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్టయ్యేవారు. ఇదే మాటను చంద్రబాబు కూడా పలికారు కూడా. న్యూఇయర్ సందర్భంగా బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు ఈ దిశగా ఆసక్తికర కామెంట్లు చేశారు. జగన్ అరెస్ట్ గురించి చంద్రబాబు ఏమన్నారంటే… “వైసీపీ హయాంలో సెకీతో సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా జగన్ వేలకోట్ల రూపాయల మేర లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
జగన్ పై చర్యలు తీసుకోవడానికి ఇవి నాకు లడ్డూ లాంటి అవకాం. కక్ష తీర్చుకోవడం, జగన్ ను అరెస్ట్ చేయడమే తన లక్ష్యమతే.. అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడిని. రాజకీయ కక్ష సాధింపు నా పద్దతి కాదు. విశ్వసనీయతకు ప్రాణమిస్తా. వైసీపీ నేతలకూ, నాకూ ఉన్న తేడా అదే” అంటూ చంద్రబాబు చాలా కూల్ గా ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమే మరి… అకారణంగా తనను జగన్ అరెస్ట్ చేశారన్న కోపంతో చంద్రబాబు కక్షతో రగిలిపోయి ఉంటే… ఆయన సీఎం అయిన మరుక్షణమే జగన్ జైలుకు వెళ్లేవారే. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారో.. జగన్ పైనా అదే మాదిరిగా ఆధారాలు లేకుండానే ఏదో ఒక కేసు నమోదు చేసి జగన్ ను చంద్రబాబు అరెస్ట్ చేయించి ఉండేవారే. అయితే రాగద్వేషాలకు ఆమడదూరం పాటించే చంద్రబాబు మంచితనం కారణంగానే తప్పు చేసినా జగన్ ఇంకా బయట తిరగగలుతున్నారు.