ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల అమలుకు శ్రీకారం చూట్టింది.
ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్లు పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించింది. చంద్రన్న బీమాకు సంబంధించి కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక ప్రకటన చేశారు. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు.
ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికులతోపాటు, మీడియా ప్రతినిధులు, లాయర్లను కూడా ఈ బీమా కిందకు తెచ్చే ఆలోచన ఉందన్నారు. గత వైసీపీ పాలనలో చంద్రన్న బీమా పేరు మార్చారని.. ఎంతోమందికి పరిహారం అందలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందన్నారు.
చంద్రన్న బీమా అందరికీ అందేలా చూస్తామని.. . రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికులు కార్మిక శాఖ లో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చు అని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుంది. ఏపీ మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో చంద్రన్న బీమా గురించి చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.