ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: రాజధాని అమరావతిపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

www.mannamweb.com


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: రాజధాని అమరావతిపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఒక్కో అడుగు పడుతుంది. గత ఐదేళ్లుగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాల్లో ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణాలపై అడుగులు చకచకా పడుతున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రబడ్జెట్‌లో రూ.15వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయిస్తామని కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగాఅమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్‌గా..పలు శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

9 అంశాలపై కమిటీ నివేదిక
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయనుంది. అమరావతి కేపిటల్ సిటీలో ఉన్న సమస్యలను గుర్తించి కమిటీ సూచనలు చేయనుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ చైర్మన్‌గా మొత్తం ఏడుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయనుంది. కమిటీలో సభ్యులుగా ఆర్ అండ్ బీ ,వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఒక ప్రతినిధిలతో కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీసీఆర్డీఏలో పనులకు సీఆర్డీఏ సీఈ కన్వీనర్‌గాను, ఏడీసీఎల్ పనులకు కన్వీనర్‌గా ఏడీసీఎల్ సీఈ కన్వీనర్‌గా వ్యవహరించనుంది. మొత్తం 9 అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెలరోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితిని కమిటీ అధ్యయనం చేయనుంది.

నిర్థిష్టమైన సూచనలు చేయనున్న కమిటీ
మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను సాంకేతిక కమిటీ అంచనా వేయనుంది. దీనికోసం గుర్తింపు పొందిన సలహాలు టెక్నికల్ కమిటీ తీసుకోనుంది. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టాన్ని కమిటీ అంచనా వేయనుంది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ పరిశీలన చేయనుంది. పైప్‌లు, ఇనుము, ఇతర మెటీరియల్ సేవా సామర్ధ్యం కమిటీ అంచనా వేయనుంది. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడంపై కమిటీ పలు సూచనలు చేయనుంది. నిలిచిపోయిన అన్ని పనులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయనుంది. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ధిష్టమైన సూచనలు చేయనుంది. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్‌లను అధ్యయనం చేసి కమిటీ సిఫార్సులు చేయనుంది.

నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని శంకుస్థాపనకు సైతం భారీగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నాడు హాజరైన సంగతి తెలిసిందే. అనంతరం పలు నిర్మాణాలను సైతం చేసింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అంతే అమరావతిలోని నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా అమరావతి రాజధానిలో నిర్మాణలపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఆయా కట్టడాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే అమరావతికి కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.