Chapati : చపాతీలు చేసిన వెంటనే గట్టిగా అవుతున్నాయా ? ఇలా చేస్తే ఎంత సేపైనా సరే.. మృదువుగా, మెత్తగా ఉంటాయి..!

Chapati : మనం గోధుమ పిండితో తయారు చేసే రకరకాల ఆహార పదార్థాలలో చపాతీలు ఒక్కటి. చపాతీలను ప్రతి రోజూ తినే వారు కూడా ఉంటారు. బరువును తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
చపాతీ తయారీ విధానం మనందరికీ తెలుసు. కానీ కొందరికి ఎంత ప్రయత్నించినా చపాతీలు మృదువుగా చేయడం రాదు. చపాతీలను చేసేటప్పుడే లేదా చేసిన కొద్ది సమయానికే గట్టిగా అవ్వడం వంటివి జరుగుతాయి. చపాతీలను మృదువుగా, మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.


Chapati
చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..

గోధుమ పిండి – రెండు కప్పులు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక కప్పు, నీళ్లు – సరిపడా.

చపాతీ తయారు చేసే విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసుకుంటూ మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువగా కలుపుకుంటే పిండి అంత మెత్తగా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిపై 20 నుంచి 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని కావల్సిన పరిమాణంలో తీసుకుని పలుచని చపాతీలలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీని పెనంపై వేసుకుని నూనె వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఎంతో మృదువుగా, మెత్తగా ఉండే చపాతీలు తయారవుతాయి. చపాతీని ఒకవైపు పూర్తిగా కాల్చిన తరువాత రెండో వైపు తిప్పి కాల్చకూడదు. ఇలా చేయడం వల్ల చపాతీలు గట్టిగా తయారవుతాయి. చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల నూనెను వాడకపోయినా కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. ఇలా చేయడం వల్ల చపాతీలు ఎక్కువ సమయం పాటు మృదువుగా ఉంటాయి. ఇలా చేసుకున్న చపాతీలను కూరలతో కలిపి తినడం వల్ల రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.