మే 1 నుండి ATM నుంచి డబ్బు విత్‌డ్రా పై ఛార్జీలు పెరుగుతున్నాయి: RBI కొత్త నిబంధనలు

మీరు ATM నుండి డబ్బు తీసుకునే అలవాటు ఉంటే, మే 1 నుండి మీకు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఛార్జీలను పెంచింది, దీనివల్ల ఇతర బ్యాంకుల ఎటిఎం నుండి డబ్బు తీసుకునేటప్పుడు లేదా బ్యాలెన్స్ చెక్ చేసేటప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


ATM కొత్త ఛార్జీల వివరాలు:

  • ఇతర బ్యాంకు ఎటిఎం నుండి డబ్బు తీసుకోవడం:

    • పాత ఛార్జీ: ₹17

    • కొత్త ఛార్జీ (మే 1 తర్వాత): ₹19

  • ఇతర బ్యాంకు ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ:

    • పాత ఛార్జీ: ₹6

    • కొత్త ఛార్జీ: ₹7

ఉచిత లావాదేవీ పరిమితులు:

  • మెట్రో నగరాలు: ఇతర బ్యాంకు ఎటిఎం నుండి 5 ఉచిత లావాదేవీలు (తర్వాత ఛార్జీలు వర్తిస్తాయి).

  • మెట్రోయేతర ప్రాంతాలు: ఇతర బ్యాంకు ఎటిఎం నుండి 3 ఉచిత లావాదేవీలు మాత్రమే.

ఇతర ముఖ్యమైన వివరాలు:

  • SBI ATMలలో బ్యాలెన్స్ తనిఖీ, మినీ స్టేట్‌మెంట్‌లకు ఛార్జీలు లేవు.

  • ఇతర బ్యాంకు ATMలలో ఈ సేవలు ఉపయోగిస్తే, ₹10 + GST చెల్లించాల్సి ఉంటుంది.

  • ATM లావాదేవీ విఫలమైతే (ఖాతాలో తగినంత నిధులు లేకపోతే), ₹20 + GST జరిమానా వర్తిస్తుంది.

ఈ మార్పులు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫార్సు మేరకు RBI ద్వారా ఆమోదించబడ్డాయి. కాబట్టి, మీరు తరచుగా ఇతర బ్యాంకు ATMలను ఉపయోగిస్తుంటే, ఈ కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.