చీపెస్ట్ పర్సనల్ లోన్స్.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా దేంట్లో వడ్డీ రేట్లు ఎలా

www.mannamweb.com


మీరు బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా.? అయితే ముందుగా ఏ బ్యాంకులో లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (NBFC) వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయనేది పోల్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. పర్సనల్ లోన్ అనేది అసురక్షిత రుణం అన్న సంగతి తెలిసిందే. అంటే ఇక్కడ మనం ప్రూఫ్‌గా ఏం సమర్పించబోం. గోల్డ్ లోన్‌కు అయితే.. బంగారం తాకట్టు పెడతాం. అందుకే పర్సనల్ లోన్ అన్‌సెక్యుర్డ్ రుణం కాబట్టి వడ్డీ రేట్లు.. ఇతర హోం లోన్, గోల్డ్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటాయి. అన్‌సెక్యుర్డ్ లోన్లు అయినప్పటికీ.. బ్యాంకులు రిస్క్ తీసుకొని అధిక వడ్డీ విధిస్తుంటాయి.
పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. ఇక్కడ ముందుగా ఈఎంఐ ఎంత పడుతుందనేది తెలుస్తుంది. వడ్డీ రేట్లకు తగ్గట్లుగా ఈఎంఐ ఎంత పడుతుందనేది తెలుసుకోవచ్చు.

ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటే ఈఎంఐ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అదే తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు.. తక్కువ ఈఎంఐ చెల్లించాలి. ఇంకా పర్సనల్ లోన్ ఈఎంఐలో మరో కీలక అంశం టైమ్ డ్యురేషన్. ఇప్పుడు ప్రముఖ బ్యాంకుల్లో.. పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

>> దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (SBI) పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 12.60 శాతం నుంచి 14.60 శాతంగా ఉన్నాయి. ఇక ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న వారికి వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు 11.45 శాతం నుంచి 11.95 శాతంగా ఉన్నాయి.
అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పర్సనల్ లోన్లపైన వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ కనిష్టంగా 10.85 శాతం నుంచి గరిష్టంగా 24 శాతం వరకు ఉన్నాయి. ఇక్కడ ప్రాసెసింగ్ రుసుములు రూ. 6500 ప్లస్ జీఎస్టీగా ఉంది.

ఐసీఐసీఐ బ్యాంకులో చూస్తే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు 10.85 శాతం నుంచి 16.25 శాతంగా ఉన్నాయి. ఫెడరల్ బ్యాంకులో చూస్తే 11.49 శాతం నుంచి 14.49 శాతంగా ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకులో 10.99 శాతం నుంచి 16.99 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేట్లు 12.5 శాతం నుంచి 14.5 శాతంగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ప్రస్తుతం 10.49 శాతం నుంచి 22.50 శాతంగా ఉన్నాయి.