Cheating Case: జనసేన నేత కిరణ్ రాయల్‌కు బిగ్ షాక్.. చీటింగ్ కేసు నమోదు

తిరుపతి జనసేన ఇంచార్జి (Tirupati Janasena Incharge) కిరణ్ రాయల్‌ (Kiran Royal)కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఆయనపై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌ (SC University Police Station)లో చీటింగ్ కేసు నమోదైంది.


బాధితురాలు లక్ష్మిరెడ్డి (Lakshmi Reddy) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిరణ్ రాయల్‌ (Kiran Royal)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జనసేన ఇంచార్జి్ కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని లక్ష్మిరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నమ్మించి మాయమాటలు చెప్పడమే కాకుండా, తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని లక్ష్మిరెడ్డి (Lakshmi Reddy) తెలిపారు.

ఈ మేరకు క్రైమ్ నెం. 22/2025 కింద 420, 417, 506 ఐపీసీ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత (Indian Law Code) బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు బుక్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే, తిరుపతి జనసేన ఇంఛార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్‌పై కేసు నమోదు అవ్వడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలోనే ఆయనను పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు.. కిరణ్‌పై కేసు నమోదైన విషయంలో జనసేన వర్గాలు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కిరణ్‌పై కుట్ర చేయించారని ఆయన అభిమానులు, మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.