కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, ప్రొటీన్లు, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి.
ఇన్ని పోషకాలు ఉన్న కాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు.
ముఖ్యంగా కాలీఫ్లవర్ గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులోని గ్లూకోరాఫేన్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్‌ను తీసుకోవచ్చు. కాలీఫ్లవర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. క్యాబేజీలో ఉండే గ్లూకోరాఫేన్ ఉదర వ్యాధులను దూరం చేస్తుంది.
కాలీఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతాయి. అలాగే, క్యాలీఫ్లవర్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
కాలీఫ్లవర్ సహజంగా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో మీకు చాలా సహాయపడుతుంది. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారు క్యాలీఫ్లవర్‌న ఆహారంలో చేర్చుకోవచ్చు.
గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని ఫోలేట్ పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో క్యాలీఫ్లవర్‌ను తప్పక చేర్చుకోవాలి.