మీ కారు ఎయిర్‌బ్యాగ్స్ పనిచేస్తున్నాయా.. ఇలా నిమిషాల్లో చెక్ చేయండి

www.mannamweb.com


కారు(car)లో ప్రయాణీకులను సురక్షితంగా ఉంచడంలో ఎయిర్‌బ్యాగ్‌లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కారుకు యాక్సిడెంట్ అయితే ఎయిర్‌బ్యాగ్‌లు(airbags) అందులో ఉన్న ప్రయాణీకులను గాయపడకుండా కాపాడతాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌బ్యాగ్‌ల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న భారత ప్రభుత్వం జనవరి 1, 2022 నుంచి దేశంలో విక్రయించే కార్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లను అందించడాన్ని తప్పనిసరి చేసింది. అందుకే చౌక వాహనాల్లో కూడా డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లను అందజేస్తున్నారు. అయితే ప్రమాదంలో మీ ప్రాణాలను కాపాడుకోవడానికి, ఎయిర్‌బ్యాగ్‌లను సరైన సమయంలో అమర్చడం చాలా ముఖ్యం.

ఎయిర్‌బ్యాగ్‌ల పరిస్థితి

అయితే చాలా మందికి తమ కారులో ఎయిర్ బ్యాగ్స్ పనిచేస్తున్నాయో లేదో తెలియదు. కాబట్టి మీ కారులో అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌ల పరిస్థితిని ఈజీగా తెలుసుకోవచ్చు. ఎయిర్‌బ్యాగ్‌ల పరిస్థితిని తెలుసుకోవడానికి మీరు కారు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ఫోకస్ చేయాలి. వాస్తవానికి, అనేక రకాల చెక్ లైట్లు కారు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై వెలుగుతుంటాయి. ఇవి పరికరాలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తెలియజేస్తాయి. మీరు కూడా అదే విధంగా ఎయిర్ బ్యాగ్స్ గురించి తెలుసుకోవచ్చు. కారు ఆన్ చేసిన వెంటనే, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై ‘SRS’ లేదా ఎయిర్‌బ్యాగ్ చెక్ లైట్ వెలుగులోకి వస్తుంది. సీటులో కూర్చున్న వ్యక్తికి ఎదురుగా ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై గుండ్రని ఆకారం కనిపిస్తే, ఇది ఎయిర్‌బ్యాగ్ చెక్ లైట్ అని అర్థం చేసుకోండి.

ఆ లైట్ ఆఫ్

మీరు కారు ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఈ లైట్ వస్తుంది. కానీ మీరు కారు నడపడం ప్రారంభించిన వెంటనే ఆ లైట్ ఆఫ్ అవుతుంది. ఇది జరిగితే ఎయిర్‌బ్యాగ్ బాగానే ఉందని, సరిగ్గా పనిచేస్తుందని అర్థం చేసుకోండి. అయితే కారు నడుస్తున్నప్పుడు కూడా లైట్ వెలుగుతూనే ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లో ఏదో లోపం ఉందని అర్థం. వైర్ కనెక్షన్ వదులుగా ఉన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్ చెక్ లైట్ తరచుగా వెలుగులోకి వస్తుంది. అందువల్ల మీరు ఆలస్యం చేయకుండా, కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి మరమ్మతు చేయించుకోండి. 2023 అక్టోబర్ 1 నుంచి అన్ని ప్యాసింజర్ కార్లలో కనీసం ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్రం ప్రకటించింది. కానీ తర్వాత ఈ రూల్స్ సడలించారు. డ్రైవర్, ముందు ప్రయాణికులకు ఒక్కొటి చొప్పున మొత్తం రెండు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.