ఎందుకైనా మంచిది.. షూలు వేసుకునే ముందు ఓసారి చెక్‌ చేసుకోండి..! ఇలా కూడా జరగొచ్చు..

www.mannamweb.com


ర్షాకాలంలో పాముల బెడద పెరుగుతుంది. ఈ సమయంలో పాములు, కప్పలు తరచూ ఇళ్ల చుట్టుపక్కల కనిపిస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. వర్షాలు, వరదల కారణంగా పాములు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి.

అందుకే వర్షాకాలంలో షూస్, బట్టలను మళ్లీ మళ్లీ చెక్ చేసుకోవాలని తరచూ వింటుంటాం.. వర్షాకాలంలో పాములు తరచుగా ఇళ్ల మూలల్లో, బాత్రూమ్ కాలువలు, బూట్ల లోపల నక్కి కనిపిస్తుంటాయి.. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ షూ లోపల ముడుచుకుని విషపూరితమైన నాగుపాము నక్కి ఉంది.. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ పడగవిప్పి పైకి లేచిన వీడియో భయానకంగా ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా బూట్లలో పాదాలు పెట్టి ఉంటే..పెద్ద ప్రమాదమే ఎదురయ్యేది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

నీరజ్ ప్రజాపత్ అనే స్నేక్‌క్యాచర్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో, అతను షూ లోపల నుండి నాగుపామును బయటకు తీస్తున్నాడు. షూ రాక్‌లో వరుసగా షూలు పేర్చి ఉండగా,వాటిలోని ఒక షూలోపల భారీ నాగుపాము నక్కిఉంది. అది గమనించిన ఆ ఇంటి యాజమాని స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను పాము పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు షులో కర్రను చొప్పించిన వెంటనే ఆ పాము కోపంతో పడగ విప్పి పైకి లేచింది. ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. వీడియోలో విష సర్పం చాలా భయానకంగా పడగవిప్పి బుసలు కొడుతుంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు.. వర్షాకాలంలో మీ బూట్లను ఎప్పుడూ చెక్ చేసుకోండి. అని సూచించారు.