Chicken లో ఈ నాలుగు పార్ట్స్ అస్సలు తినొద్దు.. తిన్నారో అంతే సంగతి

చికెన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ప్రోటీన్-రిచ్ ఫుడ్. ఇది కండరాల నిర్మాణం , మరమ్మత్తుకు, బరువు నిర్వహణకు సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే, చికెన్‌లో కొన్ని భాగాలు తింటే వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు మన శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. కనుక వాటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చికెన్ మెడ:

చాలామంది కోడి మెడ భాగాన్ని ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీనికి రుచి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ భాగంలో కోడి శోషరస వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు, బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంది. ఈ భాగంలో విషతుల్య పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదం ఉంది. ఈ భాగాన్ని తింటే, వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు మన శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. అందుకే కోడి మెడను తినకూడదు.

చికెన్ తోక:

చికెన్ తోకలో హానికరమైన బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. ఇవి ఎంత ఉడికించినా నశించవు. ఈ క్రిములు మన శరీరంలోకి చేరి కొత్త ఆరోగ్య సమస్యలు తెస్తాయి. కాబట్టి ఈ భాగాన్ని తినకుండా ఉండటమే మంచిది.

చికెన్ ఊపిరితిత్తులు:

కోడిని కోసినప్పుడు ఊపిరితిత్తులను సాధారణంగా పడేస్తుంటారు. కానీ కొంతమంది వాటిని ఇష్టంగా తింటారు. నిపుణులు మాత్రం ఇవే చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ఎందుకంటే, వీటిలో అత్యంత హానికారకమైన క్రిములు ఉంటాయట. వీటిని తినడం వలన ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే, వాటిని తినకుండా ఉండటమే మంచిది.

చికెన్ చర్మం:

చికెన్ చర్మంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చికెన్ చర్మానికి దూరంగా ఉండాలి.

ఈ నాలుగు భాగాలతో పాటుగా, చికెన్ కొవ్వును కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ కొవ్వులో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. దీనివలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పైన పేర్కొన్న భాగాలను తినకుండా ఉండటం మంచిది. అలాగే, చికెన్ ను బాగా ఉడికించి తినాలి. పచ్చిగా లేదా సగం ఉడికిన చికెన్ తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

Disclaimer: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాకు బదులుగా కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల విషయంలో మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.