కోడి ముందా..? గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందోచ్

కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక చాలా మంది ఓ జోక్‌గా తీసుకుంటారు. కానీ కానీ శాస్త్రవేత్తలకు మాత్రం పట్టు విడవకుండా..


సమాధానం చెప్పారు. గుడ్డు కంటే కోడే ముందని ఆధారాలతో సహా నిరూపించారు.

శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం.. యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్ , వార్విక్ పరిశోధకులు ఓవోక్లీడిన్-17 (OC-17) అనే ప్రొటీన్ గుడ్డు పెంకులను ఏర్పరచడానికి అవసరమని తెలిపారు. ఓవోక్లీడిన్-17 కోడి అండాశయాలలో మాత్రమే ఉత్పత్తి అవుతుందని కనుగొన్నారు. గుడ్డు పెంకులను తయారు చేసే ప్రొటీన్లు కోడిపిల్లల ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతాయన్నారు. అయితే ఓవోక్లీడిన్-17 ప్రొటీన్.. లేకుండా గుడ్డు తయారు కాదని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ గుడ్డు ఏర్పడటానికి ముందు కోడి ఉనికిని కలిగి ఉండాలనే ఆలోచనకు బలంగా మద్దతు ఇస్తుందన్నారు. ప్రోటీన్ ఉత్ప్రేరకం వలె పని చేస్తుందన్నారు. కాల్షియం కార్బోనేట్ షెల్ నిర్మాణంలో స్ఫటికీకరణకు సహాయపడుతుందని,దాన్నికోడి శరీరం మాత్రమే చేయగలడని తెలిపారు. కాబట్టి దీని ఆధారంగా.. కోడి ముందా ..గుడ్డు ముందా అనే ప్రశ్నకు చివరకు స్పష్టమైన సమాధానం దొరికిందన్నారు. కాబట్టి, కోడి మొదట వచ్చిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.