చికెన్ లివర్ తింటే ఇంత ప్రమాదమా?.

www.mannamweb.com


మన దేశంలో రాష్ట్రానికి ఒక ఆహారపు అలవాటు ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో చాలా మంది వెజ్ ఇష్టపడి తింటే మరికొన్ని రాష్ట్రాల్లో నాన్-వెజ్ ఎక్కువగా ఇష్టపడి తింటారు.

కానీ మన తెలుగు రాష్ట్రాల్లో వెజ్ తినేవారి కంటే నాన్-వెజ్ తినేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మంది చికెన్, మటన్, ఫిష్ ఎక్కువగా తింటుంటారు. అయితే చాలా మంది చికెన్ లివర్, మటన్ లివర్ తినేందుకు ఇష్టపడుతున్నారు. వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యింది కూడా. అయితే ఈ చికెన్, మటన్ లివర్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఎలాంటి హాని జరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రక్త కణాల ఉత్పత్తికి

చికెన్ లివర్‌లో ఐరన్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో ఎర్ర రక్తకణాలను అభివృద్ధి చేస్తుంది. అలాగే రక్త హీనతను దూరం చేస్తుంది. ఐరన్‌తో పాటు చికెన్ లివర్‌లో A, B12 వంటి విటమిన్స్ ఉంటాయి. అలాగే ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఎనర్జీ లెవల్స్ సరిగ్గా ఉండేందుకు సహాయం చేస్తాయి.

కండరాల వృద్ధికి

మన శరీరంలో కండరాలు వృద్ధి చెందాలంటే కచ్చితంగా ప్రోటీన్ తినాలి. అందుకే హై క్వాలిటీ ప్రోటీన్ కలిగిన లివర్ తినడం వల్ల కండరాల వృద్ధి సమృద్ధిగా జరుగుతుంది. అలాగే లివర్‌లలోని యాంటీ యాక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. దీని కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే ఇందులోని విటమిన్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. దీని ద్వారా అందంగా కనిపించొచ్చు.

బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది

మటన్ లివర్‌లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ పని తీరును మెరుగుపరుస్తుంది. మటన్ లివర్ రెగ్యులర్‌గా తినే వారి మెదడు పని తీరు అద్భుతంగా ఉంటుంది. అలాగే వారిలో కాగ్నిటివ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. దీంతో పాటు నరాల వ్యవస్థ కూడా చాలా బాగా పని చేస్తుంది. అలాగే ఎముకలు, దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

రక్త హీనతను నివారిస్తుంది

రక్త హీనత ఉన్న వ్యక్తులు ఎన్నో రకాల సప్లమెంట్స్ వాడుతుంటారు. వారికి ఫలితాలు అంత తొందరగా కనిపించినప్పటికీ, వాటినే వాడుతుంటారు. అలాంటి వ్యక్తులు తమ డైట్‌లో లివర్‌ను భాగస్వామ్యం చేసుకోవాలి. దీని వల్ల రక్త హీనతను నివారించుకోవచ్చు. అలాగే వర్కౌట్స్ చేసే వారికీ అవసరమైన ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇది ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. దీంతో మొత్తం ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

వీరు తింటే ప్రమాదం

లివర్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి వల్ల కొందరు వ్యక్తులు లివర్ తినకపోవడమే మంచిది. ఎవరైతే అధికమైన కొవ్వుతో బాధపడుతున్నారో వారు లివర్ తినకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వారు ఇంకా బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కండరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు కూడా లివర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు కూడా లివర్ తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే వైద్యుల సలహాలతోనే తీసుకోవాలి. చికెన్ లివర్ వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే తినాలి. మటన్ లివర్ కూడా అంతే. అలా కాదని క్రమం తప్పకుండా రెగ్యులర్‌గా తింటే కచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.