నిమిషానికి 4 లక్షల బులెట్లతో చైనా కొత్త గన్.. డేంజర్లో అగ్రరాజ్యం!

www.mannamweb.com


అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు తయారు చేస్తూ ప్రపంచాన్ని చైనా ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ఒక్క నిమిషంలో 4 లక్షల 50 వేల బుల్లెట్లను పేల్చే ఆయుధాన్ని తయారు చేయడంలో చైనా నిమగ్నమైంది.

ఇది మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మెషిన్ గన్ అని తెలుస్తోంది. దీనిని చైనా ఇంజనీర్లు,శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు. ఇది ఐదు కంటే ఎక్కువ బారెల్స్ కలిగి ఉంటుంది అనేది వాస్తవం. నిమిషానికి 450,000 బుల్లెట్లను పేల్చగలదు. మాక్ 7 కంటే ఎక్కువ వేగంతో అంటే దాదాపు 9 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణులను కూడా ఇది అడ్డుకోగలదు. అయితే ఇది అమెరికాకు కాస్త ఆందోళన కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫాలాంక్స్ సిస్టమ్ నిమిషానికి 4,500 రౌండ్ల బుల్లెట్లను కాల్చగలదు. అమెరికా తుపాకుల కంటే చైనీస్ మేడ్ గన్ లు 100 రెట్లు శక్తివంతమైనవి.

అయితే నిమిషానికి లక్షలాది బుల్లెట్లను వినియోగించే ఈ ఆయుధంలో మందుగుండు సామగ్రిని రీలోడ్ చేయడం కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి, సెంట్రల్ చైనాలోని పారిశ్రామిక కేంద్రమైన తైయువాన్కు చెందిన చైనా పరిశోధకుడు సులభమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. దీని కోసం బారెల్స్తో నిండిన మ్యాగజైన్ వంటి కంటైనర్ను తయారు చేశారు. ప్రతి బ్యారెల్ ఇప్పటికే బుల్లెట్లతో నిండి ఉంది. బుల్లెట్లు కాల్చిన ప్రతిసారీ కంటైనర్తో పాటు విసిరివేయబడతాయి.

100 మిలియన్ అమెరికన్ డాలర్లు

ఈ ఆయుధం భావనను మొదటిసారిగా 1990లలో ఆస్ట్రేలియన్ ఆవిష్కర్త మైక్ ఓడ్వైర్ అందించారు. ఆయుధానికి మెటల్ స్టార్మ్ అని పేరు పెట్టారు. అతని కంపెనీ, మెటల్ స్టార్మ్ ఇంక్., 36-బారెల్ టెస్ట్ సిస్టమ్ను నిర్మించింది. అది నిమిషానికి 1 మిలియన్ రౌండ్ల కాల్పుల రేటును చేరుకుంది. 2006లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఈ టెక్నాలజీ కోసం చైనా సైన్యం 100 మిలియన్ అమెరికన్ డాలర్లను ఆఫర్ చేసిందని చెప్పారు. ఈ విషయం అమెరికాకు తెలియడంతో, వారు కొత్త ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఓ డ్వైర్తో కలిసి పనిచేశారు. కానీ సాంకేతిక, ఇతర సవాళ్ల కారణంగా ప్రాజెక్ట్ రద్దు చేయబడింది.చైనా ఈ సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించింది. చాలా పరిశోధనల తర్వాత చైనా ఇప్పుడు ఈ యాక్షన్ ప్యాక్డ్ మెషిన్ గన్ని రూపొందించింది.