హైకోర్టును ఆశ్రయించిన చిరంజీవి, ప్రభాస్ నిర్మాతలు

టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సందడి షురూ కాబోతోంది. ఈసారి ఏకంగా ఐదు తెలుగులు సినిమాలు పోటీకి దిగబోతున్నాయి. ఇందులో చిరంజీవి నటించి మన శంకర వర ప్రసాద్ గారు, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు ఉన్నాయి.


వీటితోపాటు తమిళ్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా జన నాయగన్ కూడా సంక్రాంతికే రాబోతోంది.

ముందుగా రాజాసాబ్ మూవీ జనవరి 9న వస్తుండగా.. తర్వాత మన శంకరవరప్రసాద్ గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. మరోవైపు, ప్రత్యేక షోలు, టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పటిలాగే వీటికి ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కానీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపుకు నిరాకరిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.