ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప్రయాణం మొదలుపెట్టి మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. కెరీర్ ఆరంభంలో ముఖ్యమైన పాత్రలు, విలన్ పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన చిరు, హీరోగా బిజీ అవుతున్న సమయంలోనే అప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికే స్టార్ గా ఎదుగుతున్న చిరంజీవి పెళ్ళికి ఎవరు ఊహించని ఒక డ్రెస్ లో వచ్చాడట. దాంతో అందరూ ఏంటి చిరంజీవి పెళ్ళికి ఇలావచ్చాడు అని ఆశ్చర్యపోయారట. అసలు ఎలా వచ్చాడు? ఏంటా విషయం అనే వివరాలు తెలియాలంటే మాత్రం ఈ ఆర్టికల్ చదవాల్సిందే..
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలోనే అప్పట్లో స్టార్ట్ కమెడియన్ గా ఉన్న అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980 ఫిబ్రవరి 20న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి సమయానికి 5 సినిమాలల్లో హీరోగా చేస్తున్న చిరంజీవి తన పెళ్ళికి మాత్రం చిరిగిపోయిన చొక్కా వేసుకొచ్చాడని తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా? హీరో చిరంజీవి తన పెళ్లి కి చిరిగినా చొక్కాతో వచ్చే కర్మేంటి, అస్సలు నమ్మం అని మీరు అనుకుంటున్నారు కదా? స్వయంగా చిరంజీవే చెప్పిన ఆ చిరిగినా చొక్కా కథ మీకోసం…
చిరంజీవి బాపు దర్శకత్వంలో ‘మనవూరి పాండవులు’ సినిమా చేసిన విషయం తెలిసిందే. అందులో అల్లు రామలింగయ్య కూడా ఒక పాత్ర పోషించాడు. ఆ షూటింగ్ లో చిరంజీవి డెడికేషన్ చూసిన అల్లు రామలింగయ్య చాలా ఇంప్రెస్ అయిపోయాడట. ఎంతలా అంటే ఈ కుర్రాడికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనేంతగా. అయితే అదే విషయం ఆ చిత్ర నిర్మాత జయకృష్ణకు చెప్పాడట.
ఆ సినిమాలో హీరో కాకపోయినా ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్న చిరంజీవి కి నటుడిగా మంచి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాడు అల్లు రామలింగయ్య. అదే విషయాన్ని ప్రొడ్యూసర్ జయకృష్ణతో చెప్పాడట. అంతే కాకుండా చిరంజీవి వివరాలు తెలుసుకుంటే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని కూడా చెప్పాడట. దాంతో ప్రొడ్యూసర్ పిలిచి మెల్లగా మరి ఏంటి చిరంజీవీ… పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని మెల్లగా టాపిక్ తీసుకొచ్చాడట. అప్పుడే పెళ్లేంటీ… ఇంకొన్నేళ్ల వరకు ఆ ఆలోచనేలేదు అని సమాధానం చెప్పాడట చిరంజీవి.
అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ఒక వైపు ప్రొడ్యూసర్ జయ కృష్ణ, మరో వైపు అల్లు రామలింగయ్య, ఇంకో వైపు అల్లు అరవింద్ మెల్లగా మేటర్ చెప్పి కన్విన్స్ చెయ్యటానికి ట్రై చేశారట. చిరంజీవి ఏమి చెప్పకపోవడంతో ప్రొడ్యూసర్ జయకృష్ణ చిరంజీవి నాన్న వెంకట్రావు ను కలిసి చిరంజీవికి వెంటనే పెళ్లి చేసెయ్యండి లేదంటే ఇండస్ట్రీ లో పాడైపోతాడు అని అంటూ ఎదో ఎదో చెప్పి మెల్లగా వల్ల నాన్నతో ఓకే చెప్పించేసారు. ముందు నుండే ప్రొడ్యూసరుతో స్నేహం ఉన్న చిరంజీవి నాన్న అతని మాటలకు కన్విన్స్ అవ్వటంతో చిరంజీవిని పిలిచి పెళ్లి చేసుకో అంటూ చెప్పి పెళ్లి చూపులకు ఓకే చెప్పించాడు.
పెళ్లి చూపులలో సురేఖ ను చూసిన చిరంజీవి వెంటనే ఏమి చెప్పకపోయినా మెల్లగా కొన్నాళ్ళకు ఓకే చెప్పటంతో పెళ్ళికి ఏర్పాటులో మొదలయ్యాయి. ఓకే అనుకున్న రెండు నెలల్లోనే పెళ్లి అయిపోవాలని అల్లు రామలింగయ్య పట్టు పెట్టటంతో పెళ్ళికి ముహూర్తం పెట్టేసారు. ఒక పక్క చిరంజీవి 5 సినిమాల షూటింగుల్లో ఫుల్లు బిజీ. అందులో ఒకటి MS రెడ్డి నిర్మాత గా తాతయ్యకు ప్రేమలీలలు. ఆ సినిమాలో చేస్తున్న చిరంజీవి ఎలాగోలా ప్రొడ్యూసర్ ను కన్విన్స్ చేసి మూడంటే మూడు రోజులు టైం చూసుకుని పెళ్లి పెట్టుకున్నాడు.
తీరా చూస్తే పెళ్లి రోజు కూడా షూటింగ్ కు అటెండ్ అవ్వాలని చెప్పాడట MS రెడ్డి. దాంతో ఒక సాంగ్ షూటింగ్ కు అటెండ్ అయ్యిన చిరంజీవి కి ఆ షూటింగ్ లో షర్ట్ చిరిగిపోయిందట. అలాగే షూటింగ్ నుండి డైరెక్ట్ గా పెళ్లి మండపానికి వెళ్ళాడు చిరు. షర్ట్ మార్చుకోవడానికి కూడా టైం లేదు. ముహూర్తం దగ్గర పడటంతో అలానే పెళ్లి పీటలమీద కూర్చున్న చిరంజీవికి ఎవరో చెప్పారు షర్ట్ చిరిగిపోయిందని. దాంతో అసలే చిరాగ్గా ఉన్నా చిరంజీవి అయితే ఏంటి, ఇప్పుడు షర్ట్ చిరిగిపోతే తాళి కట్టనివ్వరా అని ఇరిటేట్ అయ్యాడట. ఇవన్నీ చిరంజీవి స్వయంగా చెప్పిన మాటలు.
అప్పటికే బిజీ స్టార్ గా ఎదుగుతున్న చిరంజీవి పెళ్లి రోజు కూడా షూటింగ్ కి అటెండ్ అయ్యి పెళ్ళికి షర్ట్ మార్చుకోకుండా కూర్చున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు నటన పట్ల తనకున్న అంకితభావం. మెగాస్టార్ లు వూరికే అవ్వరు. ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సినీ హీరో కాదు. వారి కుటుంబసభ్యుడు. అంతగా చిరుని ఓన్ చేసుకున్నారు మన తెలుగు ప్రజలు. రాజకీయాల్లోకి వెళ్లి 10 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నా మళ్ళీ మేకప్ వేసుకుని ఖైదీ నెంబర్ 150 తో ప్రేక్షకుల గుండెల్లో తన స్థానం ఏంటో చూపించాడు చిరు. ఆ మెగాస్టార్ సింహాసనం తనదే అని వచ్చి అక్కడే కూర్చున్నాడు.
ఆగష్టు 22 వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. 70 వ ఏట అడుగుపెడుతున్న చిరంజీవి ఇప్పుడు అనిల్ రావిపూడి తో చేస్తున్న చిత్రం రిలీజ్ కు సిద్ధం కాగా సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం 2026 సమ్మర్ లో విడుదల కానుంది. ఆయన మరిన్ని గొప్ప చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ టైమ్స్ నౌ వార్తలు బర్త్ డే విషెస్ అందిస్తుంది. హ్యాపీ బర్త్ డే మెగా స్టార్ చిరంజీవి.
































