ప్రస్తుత విద్యా సంవత్సరం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఖరారైంది. ఈ సారి భారీ వర్షాలు, తుఫాన్ల కారణంగా పలు జిల్లాల్లో పలు మార్లు సెలవులు ప్రకటించారు.
ఈ మేర రెండో శనివారం పాఠశాలలు నిర్వహిస్తున్నారు. కాగా.. డిసెంబర్ లో క్రిస్మస్ సెలవుల పైన స్పష్టత వచ్చింది. ప్రతీ ఏటా ఒక రోజు మాత్రమే ఉండే క్రిస్మస్ సెలవులు ఈ సారి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే దసరా సెలవులు.. ఆ తరువాత భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు పలు సెలవులు వచ్చాయి. సిలబస్ పూర్తి చేసేందుకు రెండో శనివారం తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, ఫైనల్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. కాగా, డిసెంబర్ నెలలో విద్యా సంస్థలకు భారీగానే సెలవులు రానున్నాయి. ముఖ్యంగా క్రిస్మస్, సంక్రాంతి సెలవులు, ఆ తర్వాత వేసవి సెలవులు భారీగా రానున్నాయి. ప్రతీ ఏటా క్రిస్మస్ విద్యా సంస్థలకు క్రిష్టియన్ మిషనరీ పాఠశాలలు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తాయి. ఇతర విద్యా సంస్థల్లో మాత్రం ఒక రోజు కే సెలవు పరిమితం చేస్తారు. అయితే.. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28వ తేదీ వరకు రానున్నాయి. అంటే మొత్తం 8 రోజులు ఇవ్వనున్నారు.
డిసెంబర్ 29వ తేదీ సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఆదే వారం గురువారం జనవరి 1 నూతన సంవత్సరం వస్తుంది. మిగతా విద్యాసంస్థలకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25, 2025వ తేదీన పబ్లిక్ సెలవుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇక డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 27 శనివారం, డిసెంబర్ 29 ఆదివారం కలిపి మొత్తం 4 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. శనివారం కూడా సెలవు ఇస్తే మొత్తం నాలుగు రోజుల వరకు స్కూళ్లకు సెలవులు వస్తాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులపై స్పష్టత రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే రోజుల్లో సెలవులు రానున్నాయి. ముందస్తుగా అధికారిక ప్రకటన ద్వారా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ముందు నుంచే పక్కా ఏర్పాట్లు చేసుకునే వెసులు బాటు కలగనుంది































