సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, అప్లై చేసే విధానం తెలుసుకోండి

www.mannamweb.com


ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్‌న్యూస్. డిగ్రీ పాసైన వారి కోసం సీఐఎస్‌ఎఫ్‌లో మంచి జాబ్స్ ఉన్నాయి. అసిస్టెంట్ కమాండెంట్(ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 31 అసిస్టెంట్ కమాండెంట్(ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు యూపీఎస్సీ సువర్ణావకాశం కల్పించింది. సీఐఎస్ఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 4 నుంచి ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో upsc.gov.in డిసెంబర్ 24 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ తర్వాత 7 రోజుల్లో అంటే 25 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫారంలో సవరణలు చేయవచ్చు. దరఖాస్తు ఫారం హార్డ్ కాపీ, అవసరమైన డాక్యుమెంట్లను తదుపరి వెరిఫికేషన్ కోసం సీఐఎస్ఎఫ్ అథారిటీకి సమర్పించడానికి చివరి తేదీ 10 జనవరి 2025గా పెట్టారు.

ఖాళీల వివరాలు
అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సీఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 25 పోస్టులు, షెడ్యూల్డ్ కులాలకు 4 పోస్టులు, షెడ్యూల్డ్ తెగలకు 2 పోస్టులు కేటాయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2025 జనవరి 1 నాటికి 35 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల కింద వర్తించే నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి?
ముందుగా యూపీఎస్సీ www.upsconline.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఒకవేళ అభ్యర్థి ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకోకపోతే వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

దీని తరువాత పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్ నింపాలి.

అన్ని వివరాలను జాగ్రత్తగా నింపి సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీని కూడా డౌన్ లోడ్ చేసుకోండి
అభ్యర్థులు దరఖాస్తు ఫారం హార్డ్‌కాపీ, అవసరమైన సర్టిఫికెట్లను వెరిఫికేషన్ కోసం సీఐఎస్ఎఫ్ అథారిటీ అడ్రస్ డైరెక్టర్ జనరల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, 13, సీజీఓ కాంప్లెక్స్, లోడి రోడ్, న్యూఢిల్లీ-110003కు 2025 జనవరి 10 లోపు పంపాలి.

పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
సీఐఎస్ఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి యూపీఎస్సీ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2025ను 09 మార్చి 2025న నిర్వహించనుంది. ఈ పరీక్షను ఢిల్లీలో నిర్వహిస్తారు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ప్రొఫెషనల్ స్కిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇతర సమాచారం కోసం అభ్యర్థులు యూపీఎస్సీ లేదా సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.