Climb Stairs: ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో పని అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. ఆఖరికి తిండి విషయంలో కూడా ఇలాగే చేస్తున్నారు. అందుకే ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
ఇప్పుడు లిఫ్టులు వచ్చాక.. చాలా మంది మెట్లు ఎక్కడమే మర్చి పోయారు. ఎప్పుడో కరెంట్ పోయినప్పుడు తప్ప.. మెట్లు అనేవి ఎక్కడం లేదు. కానీ ప్రతి రోజూ మెట్లు ఎక్కడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ మెట్లు ఎక్కితే మీ గుండె ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా.. ఈజీగా బరువు తగ్గుతారు. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. హడావిడిగా లేవడం.. తినడం.. వెళ్లడం.. ఇదే అవుతుంది. మెట్లు ఎక్కడం మొదలు పెడితే మీరు వ్యాయామం కూడా చేయాల్సిన పని లేదు. మెట్లు ఎక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి:

ప్రతి రోజూ మెట్లు ఎక్కుతూ దిగడం వల్ల కీళ్ల నొప్పులు అనేవి తగ్గుతాయి. చాలా మంది కీళ్ల సమస్యలు ఉన్నాయని మెట్లు ఎక్కరు. కానీ కీళ్ల సంబంధి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం వల్ల చాలా రిలీఫ్ దొరుకుతుంది. నరాలు, కండరాలు ఫ్రీ అవుతాయి.

గుండె ఆరోగ్యం:

మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనేది కరికి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.

కండరాలు బలంగా ఉంటాయి:

మెట్లు ఎక్కడం వల్ల కండరాలు అనేవి బలంగా, శక్తివంతంగా మారతాయి. మెట్లు ఎక్కడం వల్ల కాళ్లు, తొడలు, తుంటి కండరాలు శక్తి వంతం అవడమే కాకుండా.. పొట్ట కండరాలు కూడా బలోపేతం అవుతాయి. దీంతో కండరాలు బలంగా మారతాయి. దీని వల్ల ఫిట్ నెస్ పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళనకు చెక్:

మెట్లు ఎక్కడం వల్ల శరీరక ఆరోగ్యమే కాకుండా.. మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయి. అంతే కాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది.