ఏపీలో ఎన్డీయే నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి పెన్షన్‌ని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఈసారి పెన్షన్ ఏకంగా రూ.7,000 రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. మరి ఈసారి పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తారా? అధికారులు ఇస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని MSME, సెర్ప్, NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ సారి పెన్షన్ అధికారుల ద్వారా రాబోతోంది. కాగా, పెన్షన్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తారా? ఇంటికే వచ్చి ఇస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.