సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..ఆ ఉద్యోగులకు ఒక నెల అదనపు జీతం

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.


ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై దృష్టి పెట్టారు. తాజాగా సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆ ఉద్యోగులకు అదనపు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు. ఒక నెల గరిష్ట వేతనానికి సమానంగా గౌరవ వేతనం చెల్లించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గౌరవ వేతనం ఎవరికి వస్తుంది?

ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా రెవెన్యూ అధికారి, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపరింటెండెంట్స్, డి.తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులకు ఇది అందుతుంది. పోలింగ్, కౌంటింగ్‌కు లిమిటెడ్ పీరియడ్‌లో విధులు నిర్వహించిన జోనల్, రూట్, పోలింగ్, కౌంటింగ్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లకు గౌరవ వేతనం అందదు.