CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

www.mannamweb.com


హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్థుల కేసులో విచారణ జరుగుతోందని.. అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. ఈ దశలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ తరుఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గతంలో కూడా విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతించిందని తెలిపారు. ఇరు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో తీర్పును ఈ నెల 14 కు సీబీఐ కోర్ట్ వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ 13వ తేదీన ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక బయటకు వచ్చింది. అది కాస్తా ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించిన బెయిల్‌ షరతుల్లో సీబీఐ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న నిషేధం ఉంది. ఈ క్రమంలోనే కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నెల 17 నుంచి జూన్‌ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్‌ ఈ నెల 6న నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఆ కోర్టు ప్రధాన న్యాయాధికారి టి.రఘురాం విచారణ చేపట్టారు. కుటుంబ పర్యటన నిమిత్తం ఇంగ్లండ్‌ (లండన్‌), స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని జగన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. నేడు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.