జీతాల పెంపు, రైతు రుణమాఫీపై త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం?

www.mannamweb.com


జీతాల పెంపు, రైతు రుణమాఫీపై త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.ఈనెల 31న సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఉద్యోగులకు PRCపైన నివేదికకు మరింత టైం ఉండటంతో ఈ లోపు IR(మద్యంతర భృతి) ప్రకటించనున్నట్లు సమాచారం.

అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో లేని రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటారని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది. DSCతో పాటు ఫిబ్రవరిలో చేయూత, జగనన్న కాలనీల ప్రారంభంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అలాగే, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఈనెల 27 నుంచి వాటికి రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా….ప్రభుత్వం తరఫున వీఆర్వో రిజిస్ట్రేషన్ చేస్తారు. వచ్చేనెల 9వ తేదీ కల్లా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా కలెక్టరేట్లలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయనుంది.