సేల్స్ లో దుమ్ము రేపుతున్న CNG బైక్స్.. ఏ కంపెనీదో తెలుసా?

www.mannamweb.com


స్కూటర్ల వినియోగదారులకు పరిచయం చేయడంలో Bajaj కి మించిన కంపెనీ లేదని కొందరి వినియోగదారుల అభిప్రాయం. ఈ కంపెనీ నుంచి వచ్చిన చేతక్ తదితర స్కూటర్లు ఎక్కువగా ఆదరణ పొందాయి.

సామాన్యుడు ప్రయాణం చేయాలంటే ద్విచక్ర వాహనమే ప్రధానంగా ఉంటుంది. దీంతో మార్కెట్లోకి ఏ కొత్త బైక్ వచ్చినా కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే ఈ మధ్య పెట్రోల్ ధరలు పెరగడంతో ఫ్యూయెల్ ట్యాంక్ ఉన్న బైక్ లను కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో వాటిపై మనసు పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన CNG బైక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది మైలేజ్ ఎక్కువ ఇవ్వడంతో పాటు తక్కువ ధరనే కలిగి ఉండడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎంతలా అంటే ఆరు నెలల్లో ఈ బైక్ ను 40 వేల మంది దక్కించుకున్నారు. దీనిని బట్టి చూస్తే దీనికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ బైక్ ఏదని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

స్కూటర్ల వినియోగదారులకు పరిచయం చేయడంలో Bajaj కి మించిన కంపెనీ లేదని కొందరి వినియోగదారుల అభిప్రాయం. ఈ కంపెనీ నుంచి వచ్చిన చేతక్ తదితర స్కూటర్లు ఎక్కువగా ఆదరణ పొందాయి. అయితే గత ఏడాదిలో ఈ కంపెనీ CNG బైక్ ను పరిచయం చేసింది. 2024 జూలైలో ఫ్రీడమ్ 125 సీఎన్ జీ బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ కు సామాన్యుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని బజాజ్ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు అధిక మైలేజ్ ఇవ్వడంతో దీనిని ఎక్కువగా ఆదరిస్తున్నారు.

Bajaj 125 CNGబైక్ లో 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ మోటార్ ను అమర్చారు. ఇది 9.5 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 9.77 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో ఎల్ డీసీ స్క్రీన్లు, బ్లూటూత్ కనెక్టివిటీని చేర్చారు. 16 అంగుళాల వీల్స్, ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు డ్రమ్, డ్రమ్ ఎల్ ఈడీ, డిస్క్ ఎల్ ఈడీ అనే మూడు వేరియంట్లలో దీనిని విక్రయిస్తున్నారు. అయితే డ్రమ్ వేరియంట్ ఎంట్రీ లెవల్ గా మారింది.

ఈ బైక్ మార్కెట్లో ప్రస్తుతం రూ.89,997 తో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరయింట్ కొనుగోలు చేయాలంటే మాత్రం రూ.1.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 2 లీటర్ల కెపాసిటీ ఫ్యూయెల్ తో పాటు CNG కూడా ఉండడతో అత్యధిక మైలేజ్ ఇస్తుంది. ఒక కిలో సీఎన్ జీకి 102 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అదే ఒక లీటర్ పెట్రోల్ కు 65 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అధునాతన ఫీచర్లతో పాటు తక్కువ ధరలో ఇది లభించడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేశారు. 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు 40 వేల మంది కొనుగోలు చేశారు.

దేశంలో మొట్టమొదటిసారిగా సీఎన్ జీ బైక్ ను అందుబాటులోకి తీసుకురావడంతో చాలా మంది వినియోగదారులు దీనికి ఆకర్షితులవుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ బైక్ ల కోసం ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేవు. కానీ సీఎన్ జీ స్టేషన్లు చాలా వరకు ఉన్నాయి. దీంతో సీఎన్ జీ బైక్ కోసం ఎగబడుతున్నారు.