కోడింగ్ పై పట్టు ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకే సాఫ్ట్వేర్ జాబ్స్ దక్కుతుంటాయి. ఇలాంటి స్కిల్స్ ను స్కూల్ లెవల్ నుండే e-commerce జైంట్ Amazon అందిస్తోంది.
దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ నేర్పిస్తూ Amazon Future Engineer (AFE) ప్రోగ్రామ్ ద్వారా మెంటర్ షిప్ అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మరియు స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. గత ఏడాది, AP గవర్నమెంట్ సమగ్ర శిక్ష, Leadership for Equity, మరియు Quest Alliance వంటి స్వచ్ఛంద సంస్థలతో MOU సైన్ చేసింది. పైలట్ ప్రాజెక్ట్ గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ట్రైనింగ్ ప్రారంభించారు. 248 మంది టీచర్స్ మరియు 7,381 మంది స్టూడెంట్స్ కు కోడింగ్, AI కోర్సెస్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్లో నేర్పారు. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పూర్తి చేసిన ప్రతిభావంతులను గుర్తించి, వారి స్కిల్స్ ను అభివృద్ధి చేయడానికి విశాఖలో హ్యాకథాన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్ కు వచ్చిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు స్టార్ హోటల్ లో స్టే ఏర్పాటు చేశారు. విజేతలకు ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, టీవీలు బహుమతులుగా ఇచ్చారు.
స్వచ్ఛందంగా ట్రైనింగ్ తీసుకున్నవారికి మాత్రమే
కంప్యూటర్ మరియు కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి వాలంటీర్ గా ముందుకు వచ్చిన టీచర్స్ కు 6 నెలల పాటు Firkee (ఆన్లైన్ ప్లాట్ఫార్మ్) ద్వారా ట్రైనింగ్ ఇవ్వబడింది. వీరు నేర్చుకుంటూ, తరగతి గదిలో స్టూడెంట్స్ కు అదే నేర్పారు. “కోడింగ్ ఒక టెక్నికల్ లాంగ్వేజ్ అని, ఇతర సబ్జెక్ట్స్ తో కనెక్షన్ లేదని అనుకున్నాం. కానీ ఈ కోర్సు తర్వాత తెలుగు, సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్ట్స్ ను కూడా కోడింగ్ సహాయంతో సులభంగా నేర్పవచ్చని తెలుసుకున్నాం” అని విశాఖ మాధవధార మున్సిపల్ హైస్కూల్ ఫిజిక్స్ టీచర్ జానకీరామ్ చెప్పారు.
అదే స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న చైతన్య, Scratch (కోడింగ్ ప్లాట్ఫార్మ్) ఉపయోగించి హెల్త్ మరియు డిసీజ్ ప్రాబ్లమ్స్ ను అనాలిస్ చేస్తూ ఒక ఆన్లైన్ గేమ్ డెవలప్ చేశాడు. ఈవ్ టీజింగ్ ప్రాబ్లమ్ ను కోడింగ్ మరియు యానిమేషన్ రూపంలో విశాఖలోని తోటగరువు ZP పాఠశాల స్టూడెంట్స్ డిజైన్ చేశారు. “సబ్జెక్ట్స్ తో పాటు కంప్యూటర్ స్కిల్స్ నేర్పడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. రియల్-లైఫ్ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్స్ కనుగొనే సామర్థ్యం వస్తుంది” అని విజయనగరం జిల్లా కొత్తవలస పాఠశాల బయాలజీ టీచర్ బాపునాయుడు వివరించారు.
AFE AP కోఆర్డినేటర్ మాధవీలత ప్రకారం, “తదుపరి 3 ఏళ్లలో AP లో 5,000 టీచర్స్ మరియు 50,000 స్టూడెంట్స్ కు AI, కోడింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నాం.”