శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్, విటమిన్, మినరల్స్ తో పాటుగా చాలా అవసరం. ఇలా శరీరానికి అవసరమైన వాటిలో కొల్లాజెన్ కూడా ఒకటి. ఇది శరీరానికి ఎందుకు అవసరం, దీని ప్రయోజనాలు ఏంటంటే..
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్, విటమిన్, మినరల్స్ తో పాటుగా చాలా అవసరం. ఇలా శరీరానికి అవసరమైన వాటిలో కొల్లాజెన్ కూడా ఒకటి. కొల్లాజెన్ చాలా అరుదుగా ఆహారాల నుండి లభ్యమవుతుంది. ఇది చర్మ ఆరోగ్యం నుండి ఎముకలు, కండరాలు పట్టుత్వంలో ఉండటం వరకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కొల్లాజెన్ వల్ల శరీరానికి చేకూరే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
కీళ్లనొప్పులు..
ప్రతి వ్యక్తి జీవితంలో వయసు పెరిగే కొద్దీ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఆస్ఠియో ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఇలా శరీరంలో తగ్గే కొల్లాజెన్ ను కొల్లాజెన్ రిచ్ పుడ్స్ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు. కీళ్లు దృఢంగా మారతాయి.
విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!
స్కిన్ ఎలాస్టిసిటీ..
కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది, వృద్దాప్యానికి లోనవుతుంది. అయితే కొల్లాజెన్ తీసుకుంటే చర్మం ఎలాస్టిసిటీ మెరుగవుతుంది. చర్మం మీద ముడతలు తగ్గి, యవ్వనంగా మారుతుంది.
గట్ ఆరోగ్యం..
కొల్లాజెన్ పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడే అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది గట్ లో మంటను తగ్గిస్తుంది. లీకీ గట్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎముకల నష్టం..
ఎముకలు ఎక్కువగా కొల్లాజెన్ తో తయారవుతాయి. వయసు పెరిగే కొద్దీ కొల్లాజెన్ తగ్గడం వల్ల ఎముకల ద్రవ్యరాశి కూడా తగ్గుతుంది. అదే కొల్లాజెన్ ఆధారిత ఆహారాలు తీసుకుంటే ఎముకల నష్టాన్ని నివారించవచ్చు. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
కండర ద్రవ్యరాశి..
కండరాల కణజాలానికి కొల్లాజెన్ అవసరం. కండరాలు బలంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. కొల్లాజెన్ బాగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి.