సెప్టెంబర్ 15వ తేదీ నుంచి కాలేజీలు బంద్! ఎందుకంటే?

 తెలంగాణలో (Private college) ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ఈ నెల 15వ తేదీ నుంచి కాలేజీలను మూసివేయనున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, మరోవైపు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.


అయితే, తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టిందని, వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి కాలేజీలు నిరవధికంగా బంద్ చేయనున్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యం హెచ్చరించాయి. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి నోటీసు అందజేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయనందుకు నిరసనగా ఇంజనీర్స్ డే ను బ్లాక్ డే గా ప్రకటిస్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.