రండి.. రండి.. దయచేయండి

www.mannamweb.com


పాఠశాలల్లో నేడు పెద్ద పండగ

ముమ్మిడివరం మండలం కొత్తలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో సమావేశానికి స్వాగత ద్వారాలు ఇలా..

న్యూస్‌టుడే, పామర్రు: బడుల్లో బూజులు దులిపారు..

గదుల గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టించారు. ఆకర్షణీయ ఆహ్వాన పత్రికలు… పిల్లల తల్లిదండ్రులకు పోటీలు.. సహపంక్తి భోజనాలు.. ప్రభుత్వ పాఠశాలలకు అయిదేళ్ల తర్వాత కళొచ్చింది. ఉమ్మడి జిల్లాలో 3,851 ప్రభుత్వ పాఠశాలలు నేడు పెద్ద పండగకు సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టడానికి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తొలి ప్రయత్నంగా రాష్ట్రమంతటా ఒకే రోజు మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ శనివారం నిర్వహించనుంది.

గతమంతా చేదు జ్ఞాపకం

వైకాపా అయిదేళ్ల పాలనలో పాఠశాల విద్యలో ఎన్నో అవస్థలు ఇటు విద్యార్థులు.. అటు ఉపాధ్యాయులు ఎదుర్కొన్నారు.

నాడు-నేడు పథకం పేరిట పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని భావించించారు. మొదటి దశలో కొంతవరకు బాగానే జరిగినా రెండోదశ సకాలంలో నిధులు విడుదల చేయక నేటికీ పనులు పూర్తికాలేదు.
విద్యాసామగ్రి పేరుతో ఇచ్చిన కిట్లలో కూడా నాణ్యతాలేమే.
ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశ పెట్టి విద్యార్థులకు రెండు మాధ్యమాల్లో దేనిపైనా అవగాహన లేకుండా చేశారు.
జీవో 117 తెచ్చి విలీనం పేరుతో ప్రాథమిక విద్యను నాశనం చేశారు. నేడు పలు పాఠశాలల్లో పది మంది లోపు పిల్లలు మాత్రమే ఉన్నారు.
పదోతరగతిలో సీబీఎస్‌ఈ విధానం తెస్తున్నామంటూ కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి అదీ సరిగా అమలు చేయలేక ఆయాచోట్ల విద్యాప్రమాణాలు కుంటుపడ్డాయి.
పాఠశాలల్లో సుద్ద ముక్క కొనుగోలుకు కూడా వైకాపా హయాంలో నాలుగేళ్లపాటు పైసా విదల్చలేకపోయారు.
ప్రభుత్వ పాఠశాలలకు స్టార్‌ రేటింగ్‌

ఆయా స్థాయిలను గుర్తించి అన్ని పాఠశాలలకూ స్టార్‌ రేటింగ్‌ ఇస్తున్నారు. తక్కువ స్టార్‌ రేటింగ్‌ సాధించిన పాఠశాలల మీద దృష్టి సారించడానికి దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

విద్యా ప్రగతి పత్రాలు

విద్యార్థులకు సమగ్ర విద్యాప్రగతి పత్రాలు(హోలిస్టిక్‌ కార్డులు) అందచేశారు. వీటి లోపలి పేజీల్లో క్యుఆర్‌ కోడ్‌ కూడా పొందుపరిచారు. వీటివల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అందరూ సులువుగా తెలుసుకునే వీలుకలుగుతుంది. విద్యార్థులకు సంబంధించిన ఎత్తు, బరువు, రక్తవర్గం తదితర అంశాలు కూడా ఈ కార్డుల్లో నమోదు చేయించారు. ఇలా గాడిన పెడుతున్నారు..

కూటమి

ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.

ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో ఈ ఏడాది సీబీఎస్‌ఈ చదివిన విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు విద్యార్థులు తమకిష్టమైన మాధ్యమంలో రాసుకునే వీలు కల్పించారు.
విద్యాశాఖ మీద జరిపిన సమీక్షలో ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు జీవో 117ను రద్దు చేస్తామని ప్రకటించారు.
మెగా డీఎస్సీ పోస్టులు ప్రకటించారు. సంక్రాంతికి డీఎస్సీ ప్రకటన ఇస్తామన్నారు. ః బోధనకు ఆటంకంగా నిలుస్తున్న పలు యాప్‌లు రద్దు చేస్తామని ప్రకటించారు.
మధ్యాహ్న భోజన పథకం మెనూలో లోపభూయిష్ట విధానం వల్ల విద్యార్థులు 65 శాతానికి మించి తినడం లేదని గుర్తించి స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. ః పాఠశాల నిర్వహణకు అవసరం అయ్యే కాంపోజిట్‌ గ్రాంటును విడుదల చేసి ఊరట కలిగించారు. ఉమ్మడి జిల్లాకు సుమారుగా రూ.4 కోట్లు మంజూరు కాగా సగం వెంటనే
విడుదల చేశారు.